Movie News

టాలీవుడ్ అలెర్ట్… AIని కంట్రోల్ చేయాలి

ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం గురించి ఒక హెచ్చరిక చేశారు. ఇప్పటికే వాడకం రకరకాలుగా సామాన్యుల్లోనూ పెరిగిపోయిన నేపథ్యంలో వీటి తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ఊహకు అందటం లేదు. సెలబ్రిటీలు కోర్టుకు వెళ్లి రక్షణ తెచ్చుకున్నా సరే అంత సులభంగా ఇవి ఆగేలా లేవు. దానికి తాజా ఉదాహరణగా సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో.

కొందరు నెటిజెన్లు తమ క్రియేటివిటీ వాడి రామాయణం శాంపిల్ ని టాలీవుడ్ స్టార్స్ తో సృష్టించారు. రాముడిగా మహేష్ బాబు, సీతగా కీర్తి సురేష్, రావణుడిగా జూనియర్ ఎన్టీఆర్, మండోదరిగా జాన్వీ కపూర్, లక్ష్మణుడిగా నాని పాత్రలను ఏ మాత్రం పోలికలు మిస్ కాకుండా పర్ఫెక్ట్ గా చేశారు. సీతను లంకలో బందీని చేసినప్పుడు వచ్చే ఘట్టాన్ని శాంపిల్ గా చేశారు. యానిమేషన్ లుక్స్ స్పష్టంగా ఉన్నాయి కానీ ఈ మాత్రం అవుట్ ఫుట్ ఇవ్వడం చిన్న విషయం కాదు.

ఇది ఎందుకు ఆలోచించాలంటే ఏఐ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఇప్పుడే ఇంత సృజనాత్మకత బయటికి వస్తే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండబోతోందో ఊహించుకోవడం కష్టం. ఇవి క్రమంగా ఎక్కువైతే ఒరిజినాలిటీని కూడా అనుమానించే పరిస్థితి తలెత్తుతుంది. ఉదాహరణకు విశ్వంభర, రామాయణ టీజర్లకు నెగటివ్ రెస్పాన్స్ కనిపించడానికి కారణం ముమ్మాటికీ ఏఐనే. డ్రాగన్ విజువల్స్ మీద కూడా కామెంట్స్ వచ్చిన ఉదంతాన్ని మర్చిపోకూడదు.

కోర్టుకు వెళ్లి ప్రొటెక్షన్ తెచ్చుకున్నంత మాత్రాన సరిపోదు. క్వాలిటీ మీద మరింత దృష్టి పెట్టాలి. ఇలాంటి రామాయణ తరహా వీడియోలు ఎవరు చేసినా వీలైనంత త్వరగా వాటిని లీగల్ గా ఆపించేయాలి. లేదంటే అసలు సినిమాలకు సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఏఐ కంపెనీలు నువ్వా నేనాని పోటీ పడుతూ సరికొత్త పోకడలు తీసుకొస్తున్నాయి. అది కూడా తక్కువ ఖర్చుతో. వీళ్ళ సంగతేమో కానీ బాలీవుడ్ లో ఆర్టిస్టులు లేకుండా కేవలం ఎఐతో మూడు పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. 

This post was last modified on July 15, 2026 10:20 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

8 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

51 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago