Political News

ఆంధ్రా సర్ ఆర్ధర్ ‘కాటన్’ చంద్రబాబు!

నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్ గా ఇది జరిగే పని కాదు అంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. అయితే, పట్టుదల ఉంటే దేనినైనా సాధించగలం అని నమ్మే చంద్రబాబు మాత్రం అటువంటి విమర్శలను పట్టించుకోకుండా తన లక్ష్యం కోసం అహర్నిశలు పాటుబడుతుంటారు. గోదావరి మరియు కృష్ణా నదుల అనుసంధానం లక్ష్యంగా డిజైన్ చేసిన ప్రతిష్టాత్మక పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబాబు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. గోదావరి వరద నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

2015 మార్చిలో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది. 2016 మార్చి 28 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని విడుదల చేశారు చంద్రబాబు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించే స్థాయిలో ఏడాదిలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఔరా అనిపించిన చంద్రబాబు వైసీపీ నేతల నోళ్లు మూయించారు. పట్టిసీమ ప్రాజెక్టును వట్టి సీమ అంటూ వైసీపీ నేతలు వెటకారంగా మాట్లాడినా చంద్రబాబు పట్టించుకోలేదు. మరింత పట్టుదలతో పట్టుబట్టి మరీ పట్టిసీమను ఆయన పూర్తి చేశారు. ఆయన కృషి ఫలితంగా పదేళ్ల కాలంలో పట్టి సీమ నుంచి 450 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి 13 లక్షల ఎకరాలను స్థిరీకరించారు.

డాక్టర్ కేఎల్ రావు 124వ జయంతి వేళ పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ‘జలహారతి’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలో కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతినిచ్చి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టును జగన్ నిర్వీర్యం చేయడం రాష్ట్ర ద్రోహం, దేశ ద్రోహంతో సమానమని ఆయన మండిపడ్డారు. సాగునీటి రంగంపై జగన్ నిర్లక్ష్యాన్ని గణాంకాలతో సహా చంద్రబాబు బట్టబయలు చేశారు. ఒక వ్యక్తి ప్రాధాన్యతల కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తును, రైతాంగ ప్రయోజనాలను పణంగా పెట్టారని జగన్ పై ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తికాకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ఘనత జగన్ దని ఎద్దేవా చేశారు.

అంతేకాదు, ఆ ప్రాజెక్టు సొరంగంలో యంత్రం ఇరుక్కుపోయిన విషయాన్ని దాచిపెట్టి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన మోసకారి జగన్ అని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను ఇంత దారుణంగా మోసం చేసిన జగన్ ను ఏమనాలని ప్రజలను ప్రశ్నించారు. అందుకే, ఆ మోసానికి ప్రతీక అయిన ఆ ప్రారంభోత్సవ బోర్డును మ్యూజియంలో పెట్టి జగన్ మోసాన్ని రాబోయే తరాలకు కూడా తెలియజేయాలని చంద్రబాబు అన్నారు. జగన్ చేసిన మోసం ప్రజలకు శాశ్వతంగా గుర్తుండేలా చేస్తానని ప్రతినబూనారు.

1996లో తాను శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను 2026 సెప్టెంబర్ 1న ప్రారంభిస్తామని తెలిపారు. వంశధార-నాగావళి-గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం తన చిరకాల స్వప్నమని మరోసారి స్పష్టం చేశారు. ఆ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తామని పునరుద్ఘాటించారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల వంటి అనేక ప్రాజెక్టుల పూర్తికి నిర్దిష్ట తేదీలను ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఆంధ్రా సర్ ఆర్ధర్ ‘కాటన్’ చంద్రబాబు అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Kumar

Recent Posts

టాలీవుడ్ అలెర్ట్… AIని కంట్రోల్ చేయాలి

ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…

13 minutes ago

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

1 hour ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

2 hours ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

2 hours ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

2 hours ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

3 hours ago