సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగిన వాళ్లే. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిన వాళ్లే. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా కష్టాలు పడ్డాడని ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు చెబుతూనే ఉంటారు.
రూం మేట్స్‌గా ఉంటూ త్రివిక్రమ్, తాను పడ్డ ఇబ్బందుల గురించి సునీల్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. అంతకంటే ముందు అసిస్టెంట్ రైటర్‌గా అవకాశం కోసం త్రివిక్రమ్ ఎంత ఇబ్బంది పడ్డాడో తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ రైటర్ పోసాని కృష్ణమురళి వెల్లడించారు. త్రివిక్రమ్ కోసం కమెడియన్ గౌతం రాజు.. తన బ్రాస్‌లెట్‌ను తాకట్టు పెట్టి మరీ డబ్బులు సాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘నేను రైటర్‌గా మంచి స్థాయిలో ఉన్నపుడు త్రివిక్రమ్ అవకాశం కోసం మా ఇంటికి వచ్చేవాడు. కానీ నేను ఉదయం ఐదున్నర ఆరు గంటలకే ఇంటి నుంచి వెళ్లిపోయేవాడిని. అతను తర్వాత వచ్చి మా ఆవిడను కలిసేవాడు. నా పేరు ఆకెళ్ళ శ్రీనివాస్, నేను సార్‌కి పెద్ద ఫ్యాన్, నాకు అసిస్టెంట్ రైటర్‌గా ఛాన్స్ ఇప్పించండి అని అడిగేవాడు. మా ఆవిడ తర్వాత నాకు తన గురించి చెప్పి, అతడికి ఎస్ ఆర్ నో చెప్పండి అనేది. కానీ ఆ కుర్రాడి గురించి నాకు ఏమీ తెలియదు, అసలు నన్ను కలవకుండానే ఏం చెప్పను అనేవాడిని.
తర్వాత శ్రీనివాస్ గురించి కమెడియన్ గౌతం రాజు నాకు చెప్పాడు. పేదవాడు, డబ్బులు లేవు అని చెబుతుంటే.. అవన్నీ కాదు, మంచివాడా కాదా అని అడిగితే మంచివాడన్నాడు. నేను మద్రాసుకు వెళ్తున్నా, పది పదిహేను రోజులు అక్కడే ఉంటాను. అక్కడికి పంపించు అన్నాను. ఆ విషయం గౌతం రాజు.. త్రివిక్రమ్‌కు చెబితే మద్రాసు వెళ్లడానికి డబ్బులు లేవన్నాడు. దీంతో తన చేతికున్న బ్రేస్‌లెట్ తీసి ఒక మార్వాడీ కొట్టులో వెయ్యి రూపాయలకు తాకట్టు పెట్టి ఆ డబ్బులిచ్చి త్రివిక్రమ్‌ను మద్రాసుకు పంపించాడు’’ అని పోసాని వెల్లడించారు.
This post was last modified on July 14, 2026 6:26 pm
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…