Movie News

తారక్ సినిమా లక్ష్యాలు చాలా పెద్దవి

ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి కథనాలు అల్లుతున్న వైనం గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రతరం అవుతున్నాయి. ఇవి ఎంత దూరం వెళ్లాయంటే స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ( తారక్ ) టీమ్ నుంచి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇటీవలే విజయ్ మొదటి విడతలోనే సిఎం అయిపోయాక ఇలాంటి ప్రచారాలు మన దగ్గర ఊపందుకున్నాయి. కొందరు అల్లు అర్జున్ పేరుని కూడా తెరపైకి తెచ్చారు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా లక్ష్యాలు చాలా ఉన్నాయి. తన మార్కెట్ పరిధిని పెంచుకునే ఉద్దేశంతో ప్రాజెక్టులు లేట్ అవుతున్నా ఓపికగా భరిస్తున్నాడు. లేదంటే డ్రాగన్ కి ఇచ్చిన టైంలో ఈజీగా రెండు ప్యాన్ ఇండియా మూవీస్ చేయొచ్చు. కానీ తన ఆలోచన అది కాదు. కర్ణాటక తప్ప బయట పెద్దగా పరిచయం లేని యష్ తోనే కెజిఎఫ్ అంత గుర్తింపు తెచ్చినప్పుడు తారక్ లాంటి సీనియర్ కనక ప్రశాంత్ నీల్ తో చేయి కలిపితే ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చోననే ప్లానింగే దీనికి ప్రేరేపించింది.

టెంపర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన టార్గెట్స్ పట్ల స్పష్టంగా ఉన్నాడు. ఏదో బాలీవుడ్ లో జెండా పాతుదామని తొందరపడి చేసిన వార్ 2 డిజాస్టర్ తప్ప టెంపర్ తర్వాత ఒక్క ఫ్లాప్ లేకపోవడాన్ని ఇక్కడ గమనించాలి. ఇంత జాగ్రత్తే దేవర 2 విషయంలో ముందడుగు వేయకుండా ఆపుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాంటసీ మూవీని ఒప్పుకునేలా చేసింది. నెల్సన్ దిలీప్ కుమార్ తో భవిష్యత్తులో కమిట్ మెంట్ సజీవంగా ఉంచుకునేలా చేసింది.

నాలుగు పదుల వయసు దాటిన జూనియర్ ఎన్టీఆర్ కు ఏ కోశానా ఇప్పటికిప్పుడు పొలిటికల్ ఎంట్రీ చేసే ఉద్దేశం లేదు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సంపూర్ణంగా కెరీర్ ఉచ్ఛస్థితిని చూశాక రాజకీయాలకు వచ్చారు. బాలయ్య తన పరిధిని పరిమితంగా ఉంచుకున్నాడు. తెలుగుదేశం ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది. ఈ టైంలో ఇలాంటి వాటి గురించి ఆలోచించడం సబబు కాదు. తారక్ చేస్తోంది అదే. కానీ సోషల్ మీడియాలో చిన్న పుల్లతో పెద్ద అగ్గి రగిల్చినట్టు ఈ ఉత్తుత్తి ప్రచారాలే చాలా దూరం వెళ్తున్నాయి. 

This post was last modified on July 14, 2026 5:41 pm

Share

Recent Posts

రోడ్డుపై పడుకొని ప్రియాంకా గాంధీ నిరసన

ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో వివాదాల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్…

2 minutes ago

ఫుట్ పాత్ లపై ట్రాన్స్ ఫార్మర్లేంది స్వామీ?

మన దేశంలో పాదచారుల కోసం రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ ల మీద బడ్డీ కొట్లు మొదలు...జ్యూస్…

31 minutes ago

రేవంత్ ఫాంహౌస్ పాచిక పెద్దదే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ను నిశితంగా చూస్తే..ఆయనలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన అధినేతల నీడలు కొట్టొచ్చినట్లు…

47 minutes ago

శివన్న ‘బెయిల్’కి ప్రేమ దెబ్బ పడింది

జైలర్ తో శివరాజ్ కుమార్ మనకూ దగ్గరయ్యారు. పెద్దిలో రామ్ చరణ్ గురువుగా నటించి దానికీ ప్లస్ అయ్యారు. గౌతమీపుత్ర…

2 hours ago

రంగస్థలం కాంబో… అసలు టార్గెట్ ఏంటి

పెద్దికి అంత కష్టపడినా ప్యాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ దక్కలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు…

3 hours ago

రికమండేషన్ లేకుండానే కార్యకర్తలకు పదవులు

ఎవరి రికమండేషన్ అవసరం లేదు... ఎవరూ సిఫార్సు చేయక్కర్లేదు. నేరుగా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వడం జరుగుతుంది. కాకపొతే మీరు…

3 hours ago