Movie News

అఖిల్ ఈసారి ఆ తప్పు చేయకూడదు

అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు అనుకున్న అఖిల్.. పదేళ్లకు పైగా హిట్టు లేక తీవ్రంగా ఇబ్బంది పడి.. ఎట్టకేలకు ‘లెనిన్’ మూవీతో నిఖార్సయిన తొలి హిట్ అందుకున్నాడు. తొలి వీకెండ్లో అంచనాలకు మించి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తర్వాత కూడా బలంగా నిలబడుతోంది. 

అంతిమంగా ఇది సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా అన్నది తేలుతుంది. ఇప్పటికైతే హిట్ స్టేటస్ అందుకుంది. ఇది అక్కినేని కుటుంబానికే కాక అభిమానులకూ గొప్ప ఉపశమనం అనడంలో సందేహం లేదు. ఒక విజయం సాధించాక వచ్చే ఆత్మవిశ్వాసమే వేరు. ఇక్కడి నుంచి అఖిల్ కెరీర్ మరింత ఊపందుకుంటుందని భావిస్తున్నారు. నాగ్ దగ్గరుండి జాగ్రత్తగా ‘లెనిన్’ సినిమా తీయించి, పోస్ట్ ప్రొడక్షన్ కూడా జాగ్రత్తగా చూసుకుని కొడుక్కి విజయాన్నందించాడు.

ఇక అఖిల్ తర్వాతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘లెనిన్’లో అఖిల్ కథలో భాగంగా ఉన్నాడు కానీ.. ఇది అతణ్ని ఎలివేట్ చేయడానికి రాసిన కథ కాదు. ఇమేజ్ బిల్డప్, ఎలివేషన్ల మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. క్లైమాక్స్‌లో మినహాయిస్తే పాత్రను అండర్ ప్లే చేశారు. ఐతే ఇప్పుడు హిట్టు పడిన నేపథ్యంలో అఖిల్ మాస్ ఇమేజ్ మీద దృష్టిపెట్టాలని, తనకు సరైన ఎలివేషన్లు ఉండాలని.. అతను ఇంకా పెద్ద హీరో అయ్యేలా పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఐతే ఈ దిశగా ఆశించడంలో తప్పు లేదు కానీ.. మాస్ మాస్ అంటూ ఓవర్ ద బోర్డ్ మాత్రం వెళ్లాల్సిన అవసరం లేదు. ‘లెనిన్’తో పోలిస్తే ఇంకొంచెం ఎలివేషన్లు, మాస్ అంశాలు, యాక్షన్ ఘట్టాలు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి కానీ.. ఒకేసారి పైకి ఎదిగిపోవాలని అతణ్ని మరీ పెద్ద హీరోలా ప్రొజెక్ట్ చేయాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది. 

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఒక మాదిరిగా ఆడాక ‘ఏజెంట్’ సినిమాతో ఇలాగే ట్రై చేశారు. ఫలితం ఏమైందో తెలిసిందే. అఖిల్ ఇక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కే ప్రయత్నం చేయాలి తప్ప ‘ఏజెంట్’ తరహాలో ఒకేసారి పైకి ఎగిరిపోవాలని చూస్తే కథ మళ్లీ మొదటికి వస్తుంది. అంతే కాక గత అనుభవాల దృష్ట్యా పెద్ద దర్శకులతో భారీ చిత్రాలు చేయాలని చూడడం కంటే అప్ కమింగ్ డైరెక్టర్లతో జట్టు కట్టి మిడ్ రేంజ్ సినిమాలతో జాగ్రత్తగా కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటే మంచిది.

This post was last modified on July 14, 2026 6:14 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

5 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

7 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

7 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

9 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

10 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

11 hours ago