Movie News

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు.. అనుకోకుండా త‌మ ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌పెట్టుకున్న‌పుడు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతుంటారు. వీళ్ల‌లో ఇంత టాలెంట్ ఉందా.. ఇన్నాళ్లూ ఎందుకు దాచిపెట్టారు అనే అభిప్రాయం క‌లిగిస్తుంటారు. నంద‌మూరి బాల‌కృష్ణ చిన్న కూతురు తేజ‌స్విని ఇటీవ‌ల ఇలాగే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఆమెలో సూప‌ర్ డ్యాన్స్ ఉన్న సంగ‌తి ఇప్పుడిప్పుడే బ‌య‌టికి వ‌స్తోంది. కొన్ని నెల‌ల ముందు ఒక టాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్‌తో క‌లిసి ఫాస్ట్ బీట్ మ్యూజిక్‌కు తేజ‌స్విని డ్యాన్స్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అందులో ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో అదిరిపోయే గ్రేస్‌తో ఆక‌ట్టుకుంది నంద‌మూరి వార‌మ్మాయి.

ఇప్పుడు మ‌రో డ్యాన్స్ వీడియోతో సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చింది తేజ‌స్విని. ఈసారి ఆమె తెలుగులో మోస్ట్ పాపుల‌ర్ సాంగ్ అయిన సారంగ ద‌రియా (ల‌వ్ స్టోరీ)తో బ‌రిలోకి దిగింది. హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో హావ‌భావాలు, అద్భుత‌మైన నృత్యంతో అల‌రించింది తేజ‌స్విని. ఆమె స్పీడ్, గ్రేస్ మామూలుగా లేవు. ఫ‌స్ట్ వీడియోను మించి ఇది పాపుల‌ర్ అయ్యేలా ఉంది.

తేజ‌స్విని ఉత్సాహం చూస్తుంటే.. ఆమె త్వ‌ర‌లోనే సినిమాల్లోకి వస్తుందేమో అనిపిస్తోంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ న‌టిస్తున్న సినిమాకు ఆమె నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే తేజ‌స్విని జ్యువెల‌రీ బ్రాండుకు ప్ర‌చార‌క‌ర్త‌గా మారి, అందుకోసం ఒక యాడ్ కూడా చేసింది.

This post was last modified on July 13, 2026 1:07 am

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

22 minutes ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

1 hour ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

1 hour ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

2 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

3 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

3 hours ago