Movie News

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది. గతంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓ మోస్తరుగా పర్వాలేదనిపించుకున్నా ఓవరాల్ గా దాన్ని సక్సెస్ క్యాటగిరిలో వేసేందుకు అభిమానులే అంతగా ఇష్టపడరు. అందుకే అయ్యగారు ఎప్పుడు నెంబర్ వన్ అవుతారని వాళ్ళ ఎదురు చూపులు కొనసాగాయి. ఎవరో సీనియర్ దర్శకుడు కాకుండా ఒక్క సినిమా అనుభవమున్న మురళికిషోర్ దాన్ని చేసి చూపించారు.

ప్రధానంగా లెనిన్ లో హీరో తర్వాత ఎక్కువగా హైలైట్ అయ్యింది, నిడివి దక్కించుకుంది విలన్ పాత్ర. వసంత్ పేరుతో సినిమా మొదలైన అరగంట తర్వాత వచ్చి క్లైమాక్స్ దాకా దాదాపు తన ఉనికిని ప్రతి ఫ్రేమ్ లో చాటుకునేలా చేసిన అతని పేరు ప్రమోద్ పంజు. సలార్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పక్కన ఉంటూ ప్రభాస్ ని ఆపమని చెప్పే బాచిరాజ మన్నార్ ఇతనే. ఆపమని చెప్పన్నా అంటూ ఒకే డైలాగుతో బాగానే గుర్తుండిపోయాడు. కాకపోతే పెద్ద స్పేస్ దక్కలేదు.

ఏదైతే సలార్ లో పూర్తిగా దక్కలేదో అది లెనిన్ ఇచ్చేసింది. ప్రమోద్ పంజు కన్నడ నటుడు. టీవీ సీరియల్ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి 2015 గీతా బ్యాంగిల్ స్టోర్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఈ పదకొండు సంవత్సరాల కాలంలో చేసినవి చాలా తక్కువ సినిమాలు. మొత్తం పది కూడా లేవు. 2021 రత్నన్ ప్రపంచలో కర్ణాటక స్టేట్ అవార్డు దక్కించుకున్నాడు. అయినా కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రమోద్ పంజు ఎట్టకేలకు లెనిన్ రూపంలో బ్రేక్ అందుకున్నాడు.

ప్రస్తుతం తను హల్కా డాన్, ఇంగ్లీష్ మాంజా అనే రెండు కన్నడ సినిమాల్లో నటిస్తున్నాడు. లెనిన్ తర్వాత తెలుగు నుంచి బాగానే ఆఫర్లు వస్తున్నాయట. మన దగ్గర విలన్ల కొరత గత కొన్నేళ్లుగా చాలా ఉంది. దాన్ని తీర్చేలా ప్రమోద్ కనక ఎక్కువ చిత్రాలు టాలీవుడ్ లో చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాకపోతే కేవలం విలన్ గానే నటిస్తాడా లేక సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తాడా అనేది వేచి చూడాలి. అన్నట్టు ప్రమోద్ లెనిన్ ప్రమోషన్లలో ఎక్కువ హైలైట్ కాలేదెందుకో.  

This post was last modified on July 12, 2026 8:14 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

2 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

4 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

4 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

6 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

7 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

7 hours ago