టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగి తోపులాట కూడా తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్స్ ఫెడరేషన్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉంది. ఆమె వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
కార్యవర్గం, సభ్యుల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫెడరేషన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించాలని సుమలత నిర్ణయించడం సమస్యకు దారి తీసింది. సుమలత తీరుపై నిరసనగా పది మంది డ్యాన్సర్లు సమాఖ్యకు రాజీనామా చేశారట.
ఎన్నికలు నిర్వహించడాన్ని జానీ వర్గం సమర్థిస్తుండగా.. శేఖర్ మాస్టర్ వర్గం వ్యతిరేకించింది. దీనిపై ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో వాదించుకోవడం.. జానీ, శేఖర్ ఒకరి మీదికి ఒకరు వెళ్తూ మాటలు అనుకోవడం.. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
టాలీవుడ్లో గత దశాబ్ద కాలంగా శేఖర్, జానీ మాస్టర్లే టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు. దాదాపుగా పెద్ద సినిమాలన్నీ వీళ్లిద్దరే చేస్తున్నారు. జానీ ఒక కేసులో చిక్కుకున్న టైంలో శేఖర్ హవా సాగింది కానీ.. తర్వాత జానీ మళ్లీ కొరియోగ్రాఫర్‌గా బిజీ అయ్యాడు. ఇటీవల రామ్ చరణ్ పెద్ది సినిమాలో జానీ కొరియోగ్రఫీకి మంచి పేరొచ్చింది.
This post was last modified on July 12, 2026 9:04 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…