Movie News

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు వరకు ఆమెకు ఇక్కడ హిట్టే లేదు. అయినా సరే అవకాశాలకైతే లోటు లేదు. తొలి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ అయినా.. ఆ తర్వాత చేసిన కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా కూడా నిరాశపరిచినా.. తమిళంలో నటించిన ‘కాంత’ కూడా ఫ్లాప్ అయినా.. ఆమెకేమీ అవకాశాలకు లోటు లేకపోయింది. 

ఇలాంటి టైంలో ‘లెనిన్’ సినిమా ఆమెకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ చిత్రం భాగ్యశ్రీ కోరుకున్న విజయాన్ని అందించేలా ఉంది. ఈ నేపథ్యంలో ‘లెనిన్’ సక్సెస్ మీట్లో ఆమె ఎంత ఎమోషనల్ అయిందో తెలిసిందే. హిట్ లేనపుడే భాగ్యశ్రీ జోరు మామూలుగా లేదు. ఇక ఆ లోటు కూడా తీరిందంటే ఆమె మరింతగా దూసుకెళ్లడం ఖాయం.

ఇదిలా ఉండగా ‘లెనిన్’ సక్సెస్ నేపథ్యంలో ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న భాగ్యశ్రీ.. సినీ రంగంలోకి రావడానికి ముందు తన నేపథ్యం, కుటుంబ విషయాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. భాగ్యశ్రీని చూస్తే బాగా రిచ్ అనిపిస్తుంది కానీ.. చిన్నతనంలో ఆమెది సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబమట. అలాంటి కుటుంబాల్లో ఉండే ఆర్థిక ఇబ్బందులను తానూ అనుభవించినట్లు ఆమె చెప్పింది. తమది మహారాష్ట్ర అని.. తాను పుట్టిన కొంత కాలానికే తండ్రి ఉద్యోగం పోయినట్లు ఆమె వెల్లడించింది. 

తనకు ఇద్దరు కూతుళ్లున్నారని, ఏదైనా జాబ్ ఇప్పించమని తన తండ్రి చాలామందిని అడగడం తనకు గుర్తుందని ఆమె చెప్పింది. అది చూశాక పెద్దయ్యాక తాను బాగా డబ్బులు సంపాదించి తండ్రికి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని అనుకున్నట్లు భాగ్యశ్రీ పేర్కొంది. కొన్నేళ్ల తర్వా తన తండ్రికి నైజీరియాలో ఉద్యోగం వచ్చిందని.. తన కుటుంబం అక్కడికి వెళ్లామని.. అప్పుడు తనకు మరాఠీ తప్ప ఇంగ్లిష్ రాదని.. దీంతో అక్కడున్న ఎన్నారైలు బాగా ఏడిపించేవారని ఆమె వెల్లడించింది. 

This post was last modified on July 12, 2026 3:08 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

3 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

10 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago