2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు వెళ్లాలంటే ఆ సంఖ్య 13కు చేరనుంది. వచ్చే ఏడాది వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించగా.. ఈసారి 14 జట్లు, 57 మ్యాచ్‌లతో పూర్తిగా కొత్త ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. భారత్‌కు అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఉండగా, నవంబర్ 21న ఫైనల్ జరగనుంది.
ఒక్కో గ్రూపులో ఆరు జట్లు
2023లో పది జట్లు ఉండటంతో ప్రతి జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడింది. ఈసారి 12 జట్లను రెండు గ్రూపులుగా విడగొడతారు. ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉంటాయి. భారత్ గ్రూప్-Aలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే, మరో క్వాలిఫయర్‌తో ఉంది. దీంతో టీమ్ఇండియా మొదట ఐదు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి తొలి మూడు జట్లు డైరెక్ట్ గా తర్వాతి రౌండ్‌కు వెళ్తాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన జట్టుకు కూడా అవకాశం ఉంటుంది.
సూపర్ 7
అక్కడి నుంచే అసలు కొత్త ఫార్మాట్ మొదలవుతుంది. తర్వాతి రౌండ్‌ను ‘సూపర్ 7’గా నిర్వహిస్తారు. గ్రూప్ స్టేజ్‌లో సంపాదించిన పాయింట్లు ఇక్కడికి రావు. ఏడు జట్లు మళ్లీ సున్నా పాయింట్లతో మొదలుపెట్టి, ఒక్కో జట్టు మిగతా ఆరు జట్లతో ఆడుతుంది. అంటే భారత్ సూపర్ 7కు వస్తే మరో ఆరు మ్యాచ్‌లు తప్పవు. చివరికి పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లు సెమీఫైనల్‌కు వెళ్తాయి.
ఫైనల్‌కు వస్తే అది 13వ మ్యాచ్
అలా భారత్ లెక్క చూస్తే ఐదు గ్రూప్ మ్యాచ్‌లు, ఆరు సూపర్ 7 మ్యాచ్‌లు కలిపి 11 అవుతాయి. సెమీఫైనల్ 12వది. అక్కడ గెలిచి ఫైనల్‌కు వస్తే అది 13వ మ్యాచ్. అంటే 2023తో పోలిస్తే కప్ వరకు వెళ్లే దారిలో రెండు మ్యాచ్‌లు పెరిగాయి.
వరల్డ్‌కప్ అక్టోబర్ 2న నమీబియాలో సూపర్ సిరీస్ తో మొదలవుతుంది. ప్రధాన గ్రూప్ మ్యాచ్‌లు అక్టోబర్ 7 నుంచి జరుగుతాయి. భారత్ అదే రోజు కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. మూడు రోజుల తర్వాత అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉంది. ఫైనల్ కూడా నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లోనే జరగనుంది.
This post was last modified on October 2, 2026 9:53 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…