ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ ఫిలిం ఇండస్ట్రీగా ఉండేది కోలీవుడ్. తమిళ సినిమాల్లో కంటెంట్ అంత బలంగా ఉండేది. వసూళ్లు కూడా అలాగే వచ్చేవి. తమిళ చిత్రాలు ఇతర భాషల్లోనూ మంచి ఫలితాన్నందుకునేవి. తమిళ అనువాదాలను చూసి తెలుగు నిర్మాతలు భయపడే పరిస్థితి ఉండేది. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా?
తమిళ సినిమాల్లో క్వాలిటీ పడిపోవడం.. వాళ్ల సినిమాల పరిధి అంతకంతకూ కుచించుకోవడం.. అదే సమయంలో తెలుగుతో పాటు మిగతా భాషా చిత్రాల రేంజ్ పెరిగిపోవడంతో తమిళ సినీ జనాల అసహనం మామూలుగా లేదు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గత పదేళ్లలో వచ్చిన అతి పెద్ద మార్పును తమిళ ఫిలిం మేకర్స్ ఏమాత్రం అందిపుచ్చుకోలేక వెనుకబడిపోయారు. బాహుబలి లాంటి భారీ చిత్రాలను.. కాంతార తరహాలో సంస్కృతితో ముడిపడ్డ సినిమాలను రూపొందించలేక.. పాన్ ఇండియా స్థాయిలో తమిళ సినిమా మెరుపులు మెరిపించలేకపోయింది.
కుల వివక్ష మీద గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఘనత కోలీవుడ్ సొంతం కానీ.. ఒక దశ దాటాక ఈ సినిమాలు జనాలకు కూడా మొహం మొత్తేసిన పరిస్థితి. వెట్రిమారన్, పా.రంజిత్, మారి సెల్వరాజ్ సహా చాలామంది దర్శకులది ఇదే వరస. ఆ తరహా సినిమాలు ఇప్పుడు వేరే భాషల్లో అస్సలు వర్కవుట్ కావడం లేదు. తమిళంలో కూడా వాటి పరిధి తగ్గిపోయింది. ఇలాంటి టైంలో ధనుష్, వెట్రిమారన్ కలయికలో ‘తమిళ్ మురుగన్’ అనే సినిమాను అనౌన్స్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇటు ధనుష్, అటు వెట్రిమారన్ ఎప్పుడూ అప్రెషన్ సినిమాలు తీస్తుంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తుంటాయి.
ఇలాంటి కలయికలో పురాణ గాథ రావడం అన్నది ఊహకందని విషయం. ఇది కోలీవుడ్లో వచ్చిన అనూహ్య మార్పుకి సంకేతంగా భావించవచ్చు. డివైన్ ఎలిమెంట్స్ మీద, పురాణాల మీద సరిగ్గా సినిమాలు తీస్తే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశముంటుంది. కానీ ఈ తరహా సినిమాలు తీయడంలో తమిళ ఫిలిం మేకర్స్ బాగా వీక్. స్టార్ హీరోలు, పెద్ద దర్శకులు పూర్తిగా ఆ సినిమాలకు దూరం అయిపోయారు. ఐతే ఇటీవల ‘కరుప్పు’ సినిమా బ్లాక్ బస్టర్ కావడం..
అదే సమయంలో తమిళులు తమ దైవంగా భావించే సుబ్రహ్మణ్యస్వామి మీద తెలుగులో ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టును ప్రకటించడం.. పైగా ఆ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా మురుగన్ ఉత్తరాదిన పుట్టినట్లు నాగవంశీ పేర్కొనడం తమిళులకు కోపం తెప్పించడం.. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని ధనుష్, వెట్రిమారన్ కలయికలో ‘తమిళ్ మురుగన్’ సినిమాను ప్రకటించినట్లున్నారు.
ఇదేదో ‘గాడ్ ఆఫ్ వార్’కు పోటీగా.. మురుగుడు తమిళనాడులోనే పుట్టాడని ప్రపంచానికి చాటడానికి తీస్తున్న సినిమాలా కనిపిస్తోంది. అయినా సరే.. ఒక అగ్ర కథానాయకుడు, టాప్ డైరెక్టర్ కలిసి ఇప్పటికైనా హిందూ పురాణాలు, సంస్కృతితో ముడిపడ్డ సినిమా తీయాలన్న ఆలోచన రావడం మంచిదే అని..తెలుగు వాళ్లు గిచ్చితే కానీ వాళ్లలో కదలిక రాలేదనే చర్చ జరుగుతోంది.
This post was last modified on July 12, 2026 3:05 pm
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…