మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేసి మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి మెగా ఫ్యాన్స్ ని హ్యాపీ చేసింది. భోళా శంకర్ తర్వాత వచ్చిన గ్యాప్ కి న్యాయం చేకూరింది. ఇదంతా బాగానే ఉంది కానీ విశ్వంభర విడుదల గురించి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఆలస్యం వల్ల సామాన్య ప్రేక్షకుల్లో బజ్ తగ్గిపోయింది కానీ ప్రమోషన్లు మొదలయ్యాక, కొత్త ట్రైలర్ వచ్చాక అన్నీ సెట్ అవుతాయనే నమ్మకంతో టీమ్ ఉంది. ఇప్పుడు మన పాయింట్ దీని గురించి కాదు.
ఒకపక్క విశ్వంభర విడుదల కోసం వెయిట్ చేస్తుంటే ఇంకో వైపు మెగా 158 అప్డేట్స్ క్రమం తప్పకుండా వస్తున్నాయి. 12 గంటల పాటు ఏకధాటిగా వర్షం లో షూట్ చేసిన ఒక ఎపిసోడ్ గురించి యూనిట్ వర్గాల నుంచి సమాచారం రావడంతో సోషల్ మీడియాలో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. డెబ్భై ఏళ్ళ వయసులో ఇంత డెడికేషన్ చూపించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన దానికన్నా వేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుండటం విశేషం.
అసలు ఆశిస్తున్నది ఒకటైతే ఇస్తున్నది వేరొకటి అన్న తరహాలో మారిపోయింది మెగా మూవీస్ అప్డేట్స్. 2027 సంక్రాంతికి మెగా 158 రిలీజ్ చేయాలనే టార్గెట్ తో కెవిఎన్ ప్రొడక్షన్స్ ధృడ సంకల్పంతో ఉందట. దర్శకుడు బాబీ, చిరంజీవి ఇద్దరూ దానికి సహకరించడానికి సిద్ధంగా ఉండటంతో చకచకా చిత్రీకరణ జరిగిపోతోంది. ఫారిన్ షెడ్యూల్స్ ఉండవు కాబట్టి అనుకున్న లక్ష్యం చేరుకోవడం పెద్ద అసాధ్యం కాదు. మధ్యలో బ్రేకులు పడితే తప్ప.
ఈ లెక్కన విశ్వంభర కనక దసరా లేదా దీపావళికి కనక రాకపోతే 2027 వేసవి తప్ప మరో ఆప్షన్ ఉండదు. హరిహర వీరమల్లుకి ఇలా జాప్యం చేసే నెగటివ్ బజ్ తెచ్చుకున్నారు. అలా విశ్వంభరకు జరగకూడదు అంటే వీలైనంత త్వరగా రంగంలోకి దిగాలి. కంటెంట్ వదలాలంటే బోలెడున్నాయి. ఐటెం సాంగ్, త్రిషతో పాట, కొత్త ట్రైలర్ కట్, సెట్స్ లో వీడియోలు ఇలా ఎన్నో వాడుకోవచ్చు. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. చిరంజీవి ఎందుకు చొరవ తీసుకోవడం లేదనేదే పెద్ద ప్రశ్న.
This post was last modified on July 9, 2026 4:19 pm
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…
ఒక ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ ఆలస్యమైనప్పుడు, వాయిదాలు పడినప్పుడు దాని గురించి రకరకాల ప్రచారాలు జరగడం మాములే. బాహుబలి…
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న…
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…