Movie News

దాదా బయోపిక్… హ్యాండిల్ విత్ కేర్

ఇండియన్ క్రికెట్ లో తనదైన సంతకం చేసిన వాళ్లలో సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం. ఆటలోనే కాదు బయట కూడా దూకుడుగా ఉండే అతని శైలి అంత సులభంగా కొరుకుడు పడదు. ఎవరైనా ఫాలో చేయడానికి ట్రై చేసినా పనవ్వదు. అలాంటి లెజెండరీ క్రికెటర్ జీవితం తెరకెక్కబోతోంది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మే 14 అన్ని ప్రధాన భాషల్లో సినిమా విడుదలవుతుందని టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది.

లార్డ్స్ మైదానంలో మ్యాచ్ గెలిచాక గంగూలీ చొక్కా విప్పి విజయ గర్వంతో అరిచిన స్టిల్ నే పోస్టర్ కోసం వాడారు. రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ పోషిస్తుండగా మూవీకి ‘దాదా’ అనే టైటిల్ నామకరణం చేశారు. అయితే ఈ ప్రాజెక్టుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే మీద ఉంది. ఎందుకంటే ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా, రాజ్ కుమార్ రావుతో పరకాయ ప్రవేశం చేయించలేకపోయినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఉంటుంది.

ఇప్పటిదాకా ఈ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది ఎంఎస్ ధోని ఒక్కటే. ఇప్పటికీ దాని రీ రిలీజులను ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సచిన్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ లాంటి వాళ్ళ మీద వచ్చిన బయోపిక్స్ కమర్షియల్ గా ఆశించిన సక్సెస్ అందుకోలేదు. చెప్పే విధానంలో జరిగిన పొరపాట్లు లేదా జనాలు వాళ్ళను స్క్రీన్ మీద చూసే మూడ్ లో లేకపోవడం లాంటి కారణాల వల్ల కమర్షియల్ ఫెయిల్యూర్స్ అయ్యాయి.

ఇంకో రిస్క్ ఏంటంటే ఇప్పటి జెన్ జీ కుర్రకారుకి సౌరవ్ గంగూలీ మీద అవగాహన తక్కువ. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మనే రిటైర్మెంట్ కు దగ్గరగా వచ్చారు. వైభవ్ సూర్యవంశీ ఇప్పుడిప్పుడే తొలి అడుగు వేస్తున్నాడు. అలాంటిది జెన్ జీ కుర్రకారుకి గంగూలీ కథని మెప్పించేలా ఎలా చూపిస్తారనేది వేచి చూడాలి. బయట ప్రపంచానికి తెలియని డ్రామా ఏదైనా జొప్పిస్తే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. కాకపోతే రాజ్ కుమార్ రావు ఇలాంటి టెర్రిఫిక్ పాత్రకు సూటవ్వలేదేమోననే కామెంట్స్ వినిపిస్తున్నాయి

This post was last modified on July 8, 2026 1:25 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

52 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago