ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రమోషన్ల స్పీడ్ పెంచుతున్నారు. బజ్ పెరగాలంటే కంటెంట్ రెగ్యులర్ గా వస్తూ ఉండాలి. అప్పుడే జనాల్లో చర్చలు జరుగుతాయి. ఇటీవలే ఈ సినిమాలో లేడీస్ ని కొత్త తరహాలో పరిచయం చేసిన యూనిట్ తాజాగా తబాహి వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. మాములు సంప్రదాయానికి భిన్నంగా రెగ్యులర్ లిరికల్ తరహాలో కాకుండా ఒరిజనల్ విజువల్స్ పొందుపరిచారు. యష్, కియారా అద్వానీ రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది.
పాట మొత్తంలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఇంటా, బయట, బీచ్ దగ్గర, క్లబ్బు లోపల ఇలా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ యష్, కియారా పరస్పరం కౌగిళ్లు, ముద్దులతో నింపేశారు. కెమిస్ట్రీ చాలా ఘాటుగా ఉంది. యూట్యూబ్ లోనే ఇంత చూపిస్తే ఇక తెరమీద రచ్చ ఏ స్థాయిలో ఉంటుందోననే కామెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. యష్ సంగతేమో కానీ కియారా అద్వానీ మాత్రం ఫుల్ ఇన్వాల్వ్ మెంట్ తో లైవ్ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి యూత్ ని కట్టిపడేసేలా ఉంది.
సరే ఇలాంటి పాటలు గతంలో రాలేదా అంటే వందలు వేలల్లో వచ్చాయి. కొత్తేమి కాదు. కాకపోతే కెజిఎఫ్ నుంచి యష్ చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రాఖీ భాయ్ గా బలమైన ముద్ర వేసుకున్నాడు. అలాంటిది ఇంత అడల్ట్ కంటెంట్ తో రేపు 18 వయసు లోపలి వాళ్ళను దూరం చేసుకుంటే ఎలాని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. టీజర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ప్రమోషన్ లో రొమాన్స్ హైలైట్ చేస్తూ వచ్చారు.
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఇంకేం రివీల్ చేయబోతున్నారో కానీ మొత్తానికి టాక్సిక్ కు కావాల్సిన బజ్ ఇలాంటి పాటలు, సీన్ల వల్లే వచ్చేలా ఉంది. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి గ్లామర్ గాళ్స్ ఎంత మంది ఉన్నా యష్ ప్రియురాలిగా అధిక ప్రాధాన్యం కియారా అద్వానీకే దొరికినట్టు ఉంది. స్కిన్ షోకు ఏ మాత్రం మొహమాటపడని ఈ భామ వార్ 2లో సైతం హొయలు ఒలికించింది. ఆమెను నీట్ గా చూపించింది మన తెలుగు దర్శకులే.
This post was last modified on July 8, 2026 7:12 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…