Movie News

దర్శకుడు.. హీరోయిన్… కలిసి ఎక్కడికి వెళ్లారు?

ఫిలిం ఇండస్ట్రీలో కలిసి పని చేసే క్రమంలో ఇద్దరు ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం మామూలే. దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్.. హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. దర్శకుడిగా పరిచయం అయి, ఆ తర్వాత నటనలోకి అడుగు పెట్టిన తరుణ్ భాస్కర్.. ఈషాతో కలిసి ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రంలో నటించాడు. ఐతే ఈ సినిమా చేస్తున్నపుడే తరుణ్, ఈషాల మధ్య రిలేషన్‌షిప్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి.

త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే చర్చ ‘ఓం శాంతి శాంతి శాంతి’ టైంలో జరిగింది. దీని గురించి ఆ సినిమా ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్ ఓపెనయ్యాడు కూడా. కొన్నేళ్లుగా ఈషా తనకు తోడుగా ఉందని, తనకు అన్నీ ఈషానే అని కూడా అతను పేర్కొనడం విశేషం. ఇందులో చెప్పడానికి, దాచడానికి ఏమీ లేదన్న తరుణ్.. ఇది వ్యక్తిగత విషయం కాబట్టి, సరైన సమయంలో తమ బంధం గురించి ప్రకటన చేస్తానని అతనన్నాడు.

ఐతే తరుణ్, ఈషా కలయికలో వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ డిజాస్టర్ కాగా.. ఆ తర్వాత వాళ్లిద్దరి గురించి చర్చ ఆగిపోయింది. దీంతో బాలీవుడ్ జంటల తరహాలోనే సినిమా ప్రమోషన్ కోసం ఈ టాపిక్‌ను తెరపైకి తెచ్చారా అనే డౌట్లు కలిగాయి. కానీ తరుణ్, ఈషాలది కేవలం సినిమాతో ముడిపడ్డ బంధం కాదని స్పష్టమైంది. తాజాగా ఈ జంట కలిసి కెమెరాలకు చిక్కింది. ఇద్దరూ ఎయిర్ పోర్టులో కలిసి నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది.

ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా ఏమీ చేయట్లేదు. తరుణ్ డైరక్టోరియల్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది-2’ మేకింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ఈషాతో కలిసి కనిపించాడంటే వారి బంధం మీద ఒక క్లారిటీ వచ్చినట్లే. త్వరలోనే ఈ జంట శుభవార్త చెబితే ఆశ్చర్యమేమీ లేదు. ‘ఈ నగరానికి ఏమైంది-2’ నవంబరు 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్‌కు ఇంతకుముందే పెళ్లయి, విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

This post was last modified on July 8, 2026 3:39 pm

Share

Recent Posts

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

2 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

7 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

8 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

9 hours ago