Movie News

సినిమా చేయనన్న మాటపై వెనక్కి తగ్గిన హీరో

తమిళంలో టాప్ లీగ్ కథానాయకులకు చాలా దగ్గరగా వెళ్లిన మిడ్ రేంజ్ హీరోల్లో రవి మోహన్ అలియాస్ జయం రవి ఒకడు. ‘జయం’ సహా పలు తెలుగు రీమేక్‌లతో హీరోగా నిలదొక్కుకున్న అతను.. తర్వాత ‘తనీ ఒరువన్’తో భారీ విజయాన్నందుకుని స్టార్‌గా అవతరించాడు. తమిళంలో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన మణిరత్నం కలల చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’లో అతనే లీడ్ రోల్ చేశాడంటే తన రేంజ్ అర్థం చేసుకోవచ్చు.

ఐతే ఈ మధ్య రవి పేరు.. సినిమాలతో కంటే వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన భార్య ఆర్తితో తీవ్ర విభేదాలు తలెత్తి ఆమెకు రవి దూరం కావడం.. తర్వాత కెనీషా అనే సింగర్‌తో సహజీవనం చేయడం చర్చనీయాంశమైంది. ఐతే కెనీషాను అదే పనిగా టార్గెట్ చేయడంతో పాటు తననూ వేధింపులకు గురి చేస్తోందంటూ తన భార్య ఆర్తి మీద అతను ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఈ గొడవ సెటిలయ్యే వరకు తాను సినిమాల్లో నటించనని పేర్కొనడం సంచలనం రేపింది.

చాలా కూల్‌గా కనిపించే రవి.. ప్రెస్ మీట్లో అంత ఎమోషనల్ అవ్వడం, సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ ప్రకారమే కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడతను. తర్వాత మళ్లీ మీడియా ముందుకు కూడా రాలేదు. ఐతే ఇప్పుడు ఒక సినీ వేడుకలో రవి మాట్లాడుతూ.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన వ్యక్తిగత వివాదాలు తేలే వరకు సినిమాలు చేయనంటూ చేసిన ప్రకటనపై అతను అభిమానులకు క్షమాపణ చెప్పాడు.

తన జీవితంలో ఒక దశ ముగిసిందని.. ఇప్పుడు కొత్తగా ఇంకో దశ మొదలవుతుందని.. ఇది తనకు మరో జన్మ అనుకుంటానని.. ఇకపై మంచి సినిమాలతో అలరించడమే తన ఉద్దేశమంటూ తాను పోషించిన ముఖ్య పాత్రల పేర్లు చెప్పి మళ్లీ అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలనుకుంటున్నట్లు తెలిపాడు రవి. జయం రవి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘బ్రో కోడ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ.. రవికి జోడీగా నటించింది.

This post was last modified on July 8, 2026 12:44 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

52 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

7 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago