Movie News

కాంతార మళ్లీ వస్తుంది… కానీ

దక్షిణాది సినీ చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ‘కాంతార’ ఒకటి. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్లో ప్రాంతీయ భాషా చిత్రంగా తెరకెక్కిన ఈ కన్నడ మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. మొదట కన్నడలో అద్భుత స్పందన రావడంతో ఆ తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అనువదించి లేటుగా రిలీజ్ చేస్తే ప్రతి చోటా భారీ వసూళ్లు రాబట్టి ఫుల్ రన్లో రూ.400 కోట్ల మార్కును అందుకుంది.

హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి.. ఈ చిత్రానికి సీక్వెల్ చేయగా అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయి 900 కోట్ల వసూళ్లు సాధించింది. ఐతే ‘కాంతార: చాప్టర్-1’ పేరుతో వచ్చిన ఈ చిత్రానికి ఇంకో సీక్వెల్ ఉంటుందనే అభిమానులు ఆశతో ఉన్నారు. కానీ రిషబ్ వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోవడం, మరోవైపు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌తో రిషబ్‌కు ఏవో అభిప్రాయ భేదాలు రావడంతో ఈ చిత్రం ఉంటుందో లేదో అన్న సందేహాలు కలిగాయి.

కానీ రిషబ్ తన పుట్టిన రోజు సందర్భంగా ‘కాంతార: చాప్టర్-2’ గురించి అప్‌డేట్ ఇచ్చాడు. కాంతార ప్రపంచం కచ్చితంగా కొనసాగుతుందని అతను చెప్పాడు. తాను దర్శకత్వం చేయకుండా ఖాళీగా కూర్చోలేనని అతను స్పష్టం చేశాడు. తన రైటింగ్ టీంతో సంప్రదింపులు జరుగుతున్నాయని.. కాంతార నెక్స్ట్ సీక్వెల్‌కు కథ రెడీ అవుతుందని.. భవిష్యత్తులో కచ్చితంగా ఆ సినిమా ఉంటుందని అతను తేల్చాడు.

ఐతే హోంబలే ఫిలిమ్స్ సంస్థలోనే ఈ సినిమా ఉంటుందా అన్నది మాత్రం డౌటే. ఎందుకంటే గత పుట్టిన రోజుకు రిషబ్‌కు సోషల్ మీడియాలో మాంచి ఎలివేషన్ ఇచ్చిన ఈ సంస్థ.. ఈ సారి బర్త్ డేకి కనీసం విష్ చేయలేదు.

కొన్ని నెలల ముందు హోంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా అకౌంట్లను రిషబ్ అన్ ఫాలో చేయడంతో ఆ సంస్థ అధినేతలతో రిషబ్‌కు సంబంధాలు దెబ్బ తిన్నట్లుగా అనుమానాలు వ్యక్తయ్యాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ సందేహాలు నిజమే అనిపిస్తోంది. ఐతే భారీతనానికి మారుపేరైన హోంబలే ‘కాంతార’కు దూరం కావడం నిరాశ కలిగించే విషయమే అయినా.. ఈ క్రేజీ సీక్వెల్ కోసం వందల కోట్లు పెట్టడానికి వేరే నిర్మాణ సంస్థలు ఎగబడతాయనడంలో :సందేహం లేదు. రిషబే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించినా ఆశ్చర్యం లేదు.

This post was last modified on July 8, 2026 12:39 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

18 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

60 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago