Movie News

బండ్ల గణేష్ ఇంటి వేడుకలో త్రివిక్రమ్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు చాలా దగ్గరైన మిత్రులే. కానీ ఈ ఇద్దరికీ విడిగా అంత మంచి సంబంధాలు లేవన్న సంగతి బహిరంగ రహస్యమే. తనను పవన్‌కు దూరం చేస్తున్నాడంటూ బండ్ల మీద ఒక దశలో చాలా ఆగ్రహంతో ఉన్నాడు బండ్ల. ఇదే విషయమై ఒక సందర్భంలో పవన్ అభిమానితో ఫోన్ కాల్‌లో మాట్లాడుతూ త్రివిక్రమ్‌ను బూతులు తిట్టడం.. లీకైన ఆ ఆడియో సంచలనం రేపడం గుర్తుండే ఉంటుంది.

ఐతే ఆ ఆడియో తనది కాదు అంటూ మాట మార్చకుండా మరో సందర్భంలో త్రివిక్రమ్‌కు సారీ చెప్పాడు కానీ ఆ తర్వాత కూడా ఆయనతో పెద్దగా సన్నిహితంగా మెలిగింది లేదు. కానీ ఇటీవల త్రివిక్రమ్‌తో గ్యాప్ తగ్గంచుకునే ప్రయత్నం గట్టిగానే చేశాడు బండ్ల. త్రివిక్రమ్‌ను కొనియాడుతూ ఈ మధ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గుర్తుండే ఉంటుంది. అలాగే తన కూతురు పెళ్లికి మాటల మాంత్రికుడిని ఆహ్వానించాడు.

త్రివిక్రమ్ కూడా పాత విషయాలను మనసులో పెట్టుకోకుండా బండ్ల ఇంటి వేడుకకు హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఈ పెళ్లికి ఎంతోమంది అతిరథ మహారథులు హాజరయ్యారు. అందులో త్రివిక్రమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద బొకేతో వచ్చిన ఆయన వధూవరులకు అందించి ఆశీర్వాదాలు అందించారు. బండ్లతో కరచాలనం చేశాక ఫొటో కోసం అడుగుతుంటే ఏం పర్వాలేదని పక్కకు తప్పుకున్నారు త్రివిక్రమ్.

ఎన్నో ఏళ్ల తర్వాత వీళ్లిద్దరూ ఇలా కెమెరాల కంట పడడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య గొడవ సమసిపోయినట్లేనా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘టెంపర్’ తర్వాత సినిమాలు నిర్మించని బండ్ల.. కొన్నేళ్ల నుంచి రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ సినిమాతో పునరాగమనం చేయాలనుకున్నారు కానీ.. కుదరలేదు. ఐతే తన పెద్ద కొడుకు హితేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ పెద్ద దర్శకుడితో చేయబోయే సినిమాతో ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on August 16, 2026 11:40 pm

Share

Recent Posts

వంశీ గెలిచారు.. కొడాలి ఓడారు.. !

తాజాగా జ‌రిగిన ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో అనేక ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం, గుడివాడ…

4 minutes ago

మార్కెటింగ్ రూటు మార్చాల్సిందే దాదా

డిసెంబర్ 24 విడుదల కాబోతున్న దాదా మీద బాలకృష్ణ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది అఖండ 2…

18 minutes ago

ఆ కూటమి నేత‌ల‌కు క్లాసిస్తారా.. ప‌క్క‌న పెడ‌తారా?!

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మి త‌ర‌ఫున అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నా.. ఎక్క‌డో ఒక త‌ర‌హా అసంతృప్తి అయితే..…

21 minutes ago

జైల్లో ఉన్నా గెలిపించారు… మాజీ ఎంపీని ఓడించారు!

జైలుకు వెళ్లిన నాయ‌కులు రాజ‌కీయాల్లో స‌క్సెస్ అవుతున్నార‌నే మాట మ‌రోసారి నిజ‌మైంది. తాజాగా జ‌రిగిన జ‌డ్‌పీటీసీ ఎన్నిక‌ల్లో ఓ నాయ‌కుడు…

2 hours ago

చెవిరెడ్డి అడిగితే బిక్ష వేశాం

పరిషత్ ఎన్నికల ఫలితాలపై నాయకులు, అభ్యర్థుల రన్నింగ్ కామెంటరీ కొనసాగుతుంది. క్లీన్ స్వీప్ చేశామని అధికార కూటమి చెబుతుండగా రిగ్గింగ్…

3 hours ago

ఏబీవీ ప‌రాజ‌యం: కొత్త నేత‌ల‌ ఆశ‌ల‌కు బ్రేక్‌?

మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ఒక సంచలనం అయితే ఆయన ఓటమి…

5 hours ago