Movie News

కొత్త సినిమాకు కోత ప‌డింది

సినిమాలో విష‌యం ఉంటే ర‌న్ టైం ఎంతైనా చూస్తార‌ని ఎప్ప‌టిక‌ప్పుడు రుజువ‌వుతూనే ఉంది. ఒక ద‌శ‌లో తెలుగు సినిమాలు రెండున్న‌ర గంట‌ల‌కు మించేవి కావు. కానీ అర్జున్ రెడ్డి, రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు మూడు గంట‌ల నిడివితోనూ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేయ‌డంతో ర‌న్ టైం గురించి ఫిలిం మేక‌ర్స్ కంగారు ప‌డ‌డం మానేశారు. యానిమ‌ల్, పుష్ప‌-2 సినిమాలు 3 గంట‌ల 20 నిమిషాల నిడివితో రిలీజై మంచి ఫ‌లితాల‌ను అందుకున్నాయి. ఇక దురంధ‌ర్-2 అయితే దాదాపు నాలుగ్గంట‌ల ర‌న్ టైంతో రిలీజ‌వ‌డ‌మే కాదు, బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా అయి ఔరా అనిపించింది. 

దీంతో నిడివి విష‌యంలో ఫిలిం మేక‌ర్స్‌లో ఎక్క‌డ‌లేని దైర్యం వ‌చ్చేసింది. 3 గంట‌ల పైగా నిడివితో ధైర్యంగా సినిమాల‌ను రిలీజ్ చేసేస్తున్నారు. పెద్ది సినిమాను 3 గంట‌ల 9 నిమిషాల ర‌న్ టైంతో రిలీజ్ చేసి.. విడుద‌ల త‌ర్వాత ఇంకో 5 నిమిషాల స‌న్నివేశాల‌ను క‌ల‌ప‌డం తెలిసిందే. తెలుగులో ఈ వీకెండ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాగ‌బంధం చిత్రాన్ని టీం 3 గంట‌ల 17 నిమిషాల ర‌న్ టైంతో విడుద‌ల చేసింది. కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావ‌డం.. లెంగ్తీ ర‌న్ టైం మైన‌స్ అయింద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డంతో టీం అలెర్ట్ అయింది.

రెండో రోజే నాగ‌బంధం నిడివిని 20 నిమిషాలకు పైగా త‌గ్గించేశారు. ఇప్పుడా చిత్రం 2 గంట‌ల 45 నిమిషాల ర‌న్ టైంతో న‌డుస్తోంది. నాగ‌బంధం విజువ‌ల్‌గా అద్భుతంగా అనిపించినా.. స్క్రీన్ ప్లే లోపం, సుదీర్ఘ‌మైన యాక్ష‌న్ ఘ‌ట్టాలు, డైలాగులు.. అన‌వ‌స‌ర‌మైన పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు మిశ్ర‌మానుభూతిని క‌లిగించింది. ముందు రోజు పెయిడ్ ప్రిమియ‌ర్స్ నుంచే సినిమాకు నెగెటివ్ టాక్ వ‌చ్చింది. అయినా స‌రే.. విజువ‌ల్స్ మాత్రం అద్భుతం అనే అభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డంతో జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. వీకెండ్ వ‌ర‌కు బుకింగ్స్ బాగున్నాయి. 

ఇప్పుడు టీం కొన్ని అన‌వ‌స‌ర స‌న్నివేశాల‌కు కోత వేసి ర‌న్ టైం త‌గ్గించ‌డంతో ఎడిటెడ్ వెర్ష‌న్ చూసిన ప్రేక్ష‌కుల నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. నిర్మాత అభిషేక్ నామా ద‌ర్శ‌కుడిగా మారి రూపొందించిన ఈ చిత్రంపై ఏకంగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ పెట్టారు కొత్త నిర్మాత‌లు. పెద‌కాపుతో హీరోగా ప‌రిచ‌యం అయిన విరాట్ క‌ర్ణ ఇందులో లీడ్ రోల్ చేశాడు. న‌భా న‌టేష్ క‌థానాయిక‌గా న‌టించింది.

This post was last modified on July 5, 2026 8:12 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

57 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago