జస్ట్ ఆస్కింగ్ అంటూ.. సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించే బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ పై జనసేన నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలను బట్టి, పార్టీలను బట్టి, అందుతున్న ముడుపులను బట్టి జస్ట్ ఆస్కింగ్ ఉంటుందా? అని ప్రశ్నించారు. వైసీపీ అధినేత జగన్ హయాంలో ఎందుకు జస్ట్ ఆస్కింగ్ లేదని ఆయన నిలదీశారు. ఇప్పుడు కూడా జగన్ కనుసన్నల్లోనే ప్రకాష్ రాజ్ పనిచేస్తున్నారని.. తాడేపల్లి నుంచి ఆయనకు సంచులు అందుతున్నట్టు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్‌ను పనిగట్టుకుని విమర్శిస్తున్న ప్రకాష్‌రాజ్‌కు గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు కనిపించలేదా? అప్పుడు `జస్ట్ ఆస్కింగ్` ఏమైంది? అప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నారు. అని కందుల ప్రశ్నించారు. తాజాగా అరెస్టయిన.. యూట్యూబర్ బీ. జోసెఫ్ ఉరఫ్ రావణ్ వ్యవహారంలో ఎందుకు అతిగా స్పందిస్తున్నారని నిలదీశారు. రావణ్‌కు.. ప్రకాష్‌రాజ్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందని కందుల ఆరోపించారు. రావణ్ ఏదైనా విషయం వెలుగులోకి తీసుకువచ్చి.. పవన్‌ను దూషించగానే.. ఆ వెంటనే ప్రకాష్‌రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ రాగం అందుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభావాన్ని తగ్గించేందుకు, ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని మంత్రి ఆరోపించారు. తెరముందు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్, యూట్యూబ్‌లో రావణ్ చెలరేగుతున్నారని, కానీ.. వాస్తవానికి తెరవెనుక వేరే శక్తి ఉందని అన్నారు. ఆశక్తి తాడేపల్లిలో కూర్చుని డైరెక్ట్ చేస్తోందని.. ఈ వ్యవహారంలో లోతులు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అన్ని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చి.. ప్రజల ముందు పెడతామని కందుల వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రశ్నించడం అంటే.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమా? అని మంత్రి కందుల ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన సొమ్ములు తీసుకుని పవన్ కల్యాణ్‌ను ఒక కుల చట్రంలో బంధించేందుకు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కుట్రలను ఆధారాలతో సహా బయట పెట్టాలని పోలీసులను కోరుతున్నట్టు చెప్పారు. ఎంతటి వారున్నా.. ప్రజల మధ్యకు తీసుకువస్తా మన్నారు. పవన్‌ను ఒక కులానికి పరిమితం చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల మనిషిగా.. ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నప వన్‌ను ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం తమను తాము తగ్గించుకోవడమేనని దుయ్యబట్టారు.
This post was last modified on July 5, 2026 8:00 pm
తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…
ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…