Movie News

బేబీ బంప్‌తో మెరిసిన మ్యాడ్ భామ

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ భామ రేబా జాన్ సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం తొలి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఈ భామ.. తాజాగా బేబీ బంప్‌తో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మెటాలిక్ బ్లూ ఫిట్టెడ్ గౌన్‌లో రేబా ఎంతో గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. థై-హై స్లిట్, మినిమల్ జ్యువెలరీ, సింపుల్ హెయిర్ స్టైల్‌తో స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయింది. ప్రెగ్నెన్సీ గ్లో ఆమె అందాన్ని మరింత పెంచేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రేబా.. పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించినా, అభిమానులతో మాత్రం సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఈ భామ కొత్త ఫొటోలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల మ్యాడ్ స్క్వేర్లో స్వాతి రెడ్డితో కలిసి చేసిన స్పెషల్ సాంగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన సీఎం విజయ్ చిత్రం జననాయగన్, సకలకళా వల్లభ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

This post was last modified on July 4, 2026 11:28 pm

Page: 1 2

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

53 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

1 hour ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

1 hour ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

4 hours ago