Movie News

ఇళయరాజా ఇకపై ఊరికే ఉంటారా

కోలీవుడ్ లోనే కాదు మన టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ లోనూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి. ఇళయరాజా కంపోజ్ చేసిన 134 సినిమాల పాటల ఆడియో హక్కులు వాటిని కొన్న సరేగామా సంస్థకే చెందుతాయని, అంతకు ముందు వాటిని చేయించుకుని మీకు పారితోషికం ఇచ్చిన నిర్మాతకు ఉంటాయి తప్ప మీకు కాదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దీంతో వివాదంలో పడ్డ ఈ 134 సినిమాల సాంగ్స్ ఏ ప్లాట్ ఫార్మ్ పై ఉంచడానికి వీలు లేదు.

ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. ఇకపై ఏదైనా సినిమాలో ఇళయరాజా పాటలు వాడుకుంటే ఆయన కేసు వేస్తారా లేదాని. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. న్యాయస్థానం అభ్యంతరం చెప్పింది కేవలం 134 సినిమాల గురించే. ఇంకో వెయ్యి దాకా ఆయన డిస్కోగ్రఫీలో ఉన్నాయి. సో వాటి మీద రైట్స్ అలాగే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా దర్శకులు సారెగామా సొంతం చేసుకున్న సాంగ్స్ వాడుకోవాలంటే ఆ కంపెనీకి రాయల్టీ చెల్లింది హక్కులు పొందాలి.

కాపీ రైట్ చట్టం చాలా క్లిష్టంగా ఉంటుంది. దాన్ని సాంతం అవగాహన చేసుకుంటే తప్ప ఇలాంటి విషయాల్లో పోరాడలేం. ఇళయరాజా ఎందుకింత పట్టుదలతో ఉన్నారంటే కారణం పాటలను తమ ఆస్తిగా భావించే సంగీత దర్శకులకు న్యాయం జరగాలని. ఇందులో ఆయన చేసిన మంచి కూడా ఉంది. ఇలాంటి కాంట్రావర్సిల వల్ల పాత చిత్రాల ప్రొడ్యూసర్లు బాగా లాభ పడుతున్నారు. మ్యూజిక్ సంస్థలు ఒక్కో పాట మీద లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాయి.

ఇళయరాజా దీని మీద మళ్ళీ అప్పీల్ చేస్తారో లేదో చూడాలి. దక్షిణాది పరిశ్రమలో తిరుగు లేని ముద్ర వేసిన ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పటికీ ఉత్సాహంగా సినిమాలకు పని చేస్తున్నారు. దేశ విదేశాల్లో లైవ్ కన్సర్ట్స్ ఇస్తూనే ఉన్నారు. తెలుగులో చేయడం తగ్గించారు కానీ తమిళంలో ఇప్పటికీ న్యూ జనరేషన్ దర్శకులు ఆయనతో సంగీతం చేయించుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదంతా సద్దుమణిగే వరకు ఆ 134 సినిమాల హక్కులు ఇళయరాజాకు లేనట్టే.

This post was last modified on July 2, 2026 9:36 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

36 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago