Movie News

లెనిన్ భాగ్యశ్రీకే రాసిపెట్టి ఉంది

ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు ముందే ఈ మార్పు జరుగుతుంటుంది. చాలా కొన్ని సందర్భాల్లో మాత్రమే షూటింగ్ కూడా చేశాక ఆర్టిస్టులను మార్చేస్తుంటారు. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’లో ఈ రెండో రకమైన మార్పే జరిగింది. ఈ చిత్రానికి కథానాయికగా శ్రీలీలను అధికారికంగా ప్రకటించడం.. ఆమె చిత్రీకరణకు కూడా హాజరు కావడం తెలిసిందే.

కానీ అనూహ్యంగా తన స్థానంలోకి భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. దీనికి కారణాలేంటన్నది వెల్లడి కాలేదు. ఐతే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ముందు ఇందులో కథానాయిక పాత్ర భాగ్యశ్రీ దగ్గరికే వెళ్లిందట. కానీ ఏవో కారణాలతో ఆమె ఈ సినిమా ఒప్పుకోలేకపోయిందట. తర్వాత అనుకోకుండా మళ్లీ ఆ పాత్రకు తనే ఎంపికయ్యానని ఆమె మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

మొదట దర్శకుడు మురళీ కిషోర్ ‘లెనిన్’ కథ, అందులో భారతి పాత్ర గురించి చెప్పినపుడు తాను ఎంతో ఎగ్జైట్ అయినట్లు భాగ్యశ్రీ చెప్పింది. భారతి పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపించిందని.. ప్రేమకథ చాలా సహజంగా అనిపించిందని. ఎపిక్ లవ్ స్టోరీస్‌లో ఉన్న లక్షణాలు ఇందులో ఉన్నాయని ఆమె చెప్పింది. ఐతే ఈ పాత్ర విషయంలో తాను ఎంతో ఎగ్జైట్ అయినప్పటికీ.. డేట్లు, ఇతర కారణాలతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని.. కానీ తర్వాత మళ్లీ అనుకోకుండా ఈ సినిమా తన చేతికి వచ్చిందని ఆమె చెప్పింది.

మొత్తానికి ఒకసారి భాగ్యశ్రీని కాదనుకుని, శ్రీలీలను ఎంపిక చేశాక కూడా ఆమెను తప్పించి తిరిగి భాగ్యశ్రీనే ఈ పాత్రకు సెలక్ట్ చేశారంటే బలమైన కారణమే ఉందనుకోవాలి. ఈ మార్పు వల్ల ‘లెనిన్’ టీంకు డబ్బులతో పాటు సమయం కూడా వృథా అయింది. అయినా హీరోయిన్ని మార్చారంటే శ్రీలీల ఈ పాత్రకు సూట్ కాదని, దానికి భాగ్యశ్రీనే కరెక్ట్ అని టీం ఎంత బలంగా ఫిక్సయిందో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on July 3, 2026 12:59 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

18 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago