Movie News

నాయకుడుకి A ముద్ర… రావడం ఫిక్సేనా

ఆరు నెలల నుంచి నిర్మాత ఆఫీస్ లో సెన్సార్ చిక్కుల్లో మగ్గిపోతున్న జన నాయకుడు ఎట్టకేలకు సర్టిఫికెట్ దక్కించుకుందని చెన్నై అప్డేట్. ఊహించినట్టే A వచ్చిందని సమాచారం. జూలై 16 లేదా 23 రెండో డేట్లలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయట. అదే టైంలో విశాల్ మకుటం ఉన్న నేపథ్యంలో ఏదైనా సరే ముందుగానే నిర్ణయించుకుని చెప్పాలని బయ్యర్లు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే జన నాయగన్ సోలో రిలీజ్ అయితేనే సేఫ్ అవుతుంది.

నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికైతే ఎలాంటి న్యూస్ రాలేదు. విపరీతమైన జాప్యం వల్ల నెలల తరబడి పెట్టుబడి భారం పెరిగిపోయింది. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు వెనక్కు ఇచ్చినట్టు వార్తలు ఉన్నాయి. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలవుతున్నా ఆయన చివరి సినిమా విడుదలకు ఇంకా చిక్కులు తొలగకపోవడం పట్ల అభిమానులు అసహనంతో ఉన్నారు. విజయ్ కూడా అంత చొరవ చూపడం లేదనే డౌట్స్ లేకపోలేదు.

ఒకసారి లీకుల బారిన పడి చాలా మంది చూసేసిన జన నాయకుడు ఇంతకన్నా లేట్ చేయడం భావ్యం కాదు. పైగా భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ ట్రైలర్ తోనే వచ్చేసింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్, కలెక్షన్స్ భీభత్సంగా ఆశించలేం కానీ తమిళనాడులో భారీ రెవిన్యూ రావడం ఖాయం. ముఖ్యమంత్రిగా విజయ్ పాలనలో బిజీ అయిపోవడంతో ఈ సినిమా గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం తప్పించి ఇంకేం చేయలేరు.

ట్విస్ట్ ఏంటంటే ఈ నెలాఖరులో సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ ఉంది. విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దానికి దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి జన నాయకుడు దానికి కనీసం రెండు వారాల గ్యాప్ ఉండాలని కోరుకుంటే మాత్రం జూలై 16 విజయ్ వచ్చేయాలి. ప్రస్తుతానికి ఇవన్నీ లెక్కల దశలోనే ఉన్నాయి కనక నిర్ధారణగా ఏదీ చెప్పలేం. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చిన జన నాయకుడులో పూజా హెగ్డే, మమిత బైజు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

This post was last modified on July 2, 2026 12:22 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago