
అమ్మడు రీసెంట్ గా తన డెబ్యూ మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆమె తనదైన చిరునవ్వుతో అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో దివిజ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. లేత పర్పుల్ కలర్ డ్రెస్సులో అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ముస్తాబై వచ్చింది.
ఈ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో దివిజ ఎంతో అందంగా ఉందంటూ ఫాలోవర్స్ ప్రశంసిస్తున్నారు. గ్లామర్ షో కు మాత్రమే పరిమితం కాకుండా ఇలా పద్ధతిగా కనిపిస్తూనే యూత్ ను అట్రాక్ట్ చేయడం ఆమెకు బాగా కలిసొచ్చిన అంశం. ఇప్పటికే చెప్పాలని ఉంది అనే మ్యూజికల్ వీడియోకు స్వయంగా దర్శకత్వం వహించి తనలోని మల్టీ టాలెంట్ ను బయటపెట్టిన ఈమెకు సినిమాల పట్ల మంచి అవగాహన ఉంది.
సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఈ కొత్త సినిమాకు కచ్చితంగా ప్లస్ అవుతుందని ఆశిస్తోంది. జూలై 18వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఒక స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న దివిజ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Gulte Telugu Telugu Political and Movie News Updates