Movie News

శుభాకాంక్షలు సరే… శుభవార్త ఎక్కడ

ఇవాళ అల్లరి నరేష్ పుట్టినరోజు. ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు ఒక్కొక్కటిగా గ్రీటింగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్లు విడుదల చేస్తున్నాయి. సెప్టెంబర్ 4 ‘రంభ ఊర్వశి మేనక’ వస్తుందని అధికారికంగా ప్రకటించారు. అయితే మన టాపిక్ అది కాదు. అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘ఆల్కహాల్’ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత ఏడాది టీజర్ తో పాటుగా 2026 జనవరి 1 మూవీ రిలీజ్ ఉంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చింది.

అంతే ఆ తర్వాత ఉలుకు పలుకు లేదు. అల్కహాల్ టీజర్ వచ్చి 9 నెలలు దాటేసింది. ఇప్పటి దాకా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు. తాజాగా వదిలిన కొత్త పిక్ లో హీరోకి శుభాకాంక్షలు చెప్పారు కానీ అసలైన శుభవార్త మాత్రం అందులో లేదు. మెహర్ తేజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుహాని శర్మ, నీహారిక ఎన్ఎం హీరోయిన్లు కాగా సత్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. గిబ్రాన్ సంగీతం అందించడం లాంటి బలమైన టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేసింది.

కంటెంట్ విషయంలో ఏదైనా జాప్యం జరుగుతోందో లేక ఓటిటి డీల్ లాంటి చిక్కులు ఏమైనా ఏర్పడ్డాయో తెలియదు కానీ ఆల్కహాల్ పేరుకి తగ్గట్టే ఒక వర్గం మూవీ లవర్స్ అటెన్షన్ అయితే లాగింది. మందు అలవాటు లేని ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీశారట. టీజర్ లో అదే హైలైట్ చేశారు. ఇంత వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి ప్రెజెంటేషన్ కూడా అదే స్థాయిలో ఉంటే జనాలకు కనెక్ట్ కావొచ్చు..

ఇంతకీ ఆల్కహాల్ ని థియేటర్ రిలీజ్ చేసే ఉద్దేశంలో నిర్మాత నాగవంశీ ఉన్నారో లేదో అంతు చిక్కడం లేదు. ఇదే బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి తీసిన ‘మ్యాజిక్’ కూడా ఇదే తరహాలో మోక్షం కోసం ఎదురు చూస్తోంది. ఇంత అగ్ర నిర్మాణ సంస్థ నుంచి పేరున్న హీరోల సినిమాలే ఇలా రిలీజ్ గుమ్మం దగ్గర ఆగిపోవడం విచిత్రమైన విషయం. బడ్జెట్ ఇష్యూస్, బిజినెస్ సమస్యలు లేని ఇలాంటి వాటికి ఆటంకాలు ఎదురు కావడమంటే సంథింగ్ ఫీషి అనుకోవాలి. అదేంటో మరి.

This post was last modified on June 30, 2026 12:32 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago