Movie News

త్రివిక్రమ్ రిస్కు… శివుడి సెంటిమెంట్

నిన్న జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయ వ్యక్తీకరణ జరుగుతోంది. ఏఐ వాడి పోస్టర్ చేయడం పట్ల కొంత మిశ్రమ స్పందన ఉండగా, కుమారస్వామి జననం ఉత్తరాదిలో జరిగినట్టు నిర్మాణ సంస్థ ట్వీట్లలో పేర్కొనడం తమిళులకు ఆగ్రహం కలిగించింది. తమ ఆరాధ్య దైవం గురించి పూర్తిగా తెలుసుకుని వాస్తవాలు పెట్టమని కోరుతున్నారు. ఇదంతా అలా ఉంచితే త్రివిక్రమ్ ఫేస్ చేయాల్సిన రిస్కులు చాలా ఉన్నాయి.

వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శివుడి ఎలిమెంట్. టాలీవుడ్ హిస్టరీలో అధిక శాతం ఆయన బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాలు ఆశించిన విజయం అందుకోలేదు. స్వర్గీయ ఎన్టీఆర్ ‘దక్షయజ్ఞం’ గొప్పగా ఉంటుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. చిరంజీవి ‘ఆపద్బాంధవుడు’లో మెగాస్టార్ మొదటిసారి శివుడిగా నర్తిస్తే వర్కౌట్ కాలేదు. ‘శ్రీ మంజునాథ’లో ఏకంగా టైటిల్ రోల్ చేశారు కానీ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. శివలింగం మీద కథ నడిపించిన ‘అంజి’ ఎంత ఫ్లాపో చెప్పాల్సిన పని లేదు.

నాగార్జున ‘డమరుకం’ సైతం శివుడి నేపధ్యం తీసుకుని ఏళ్లకేళ్లు నిర్మాణం జరుపుకుని ఎన్నో అడ్డంకులు దాటుకుని చివరికి నిరాశ కలిగించే ఫలితాన్ని అందుకుంది. మంచు విష్ణు ‘కన్నప్ప’ ఏమయ్యిందో తెలిసిందే. అయితే కొన్ని ఈ ప్రతికూల సెంటిమెంట్ ని గెలిచినవి ఉన్నాయి. కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ క్లాసిక్ గా తరతరాలు గుర్తుండిపోయింది. బాలకృష్ణ ‘అఖండ’ చాలా పెద్ద హిట్టయ్యింది. నలభై సంవత్సరాల క్రితం గీత ఆర్ట్స్ స్టార్స్ లేకుండా తీసిన ‘మా ఊళ్ళో మహాశివుడు’ ఆడలేదు.

బ్లాక్ అండ్ వైట్ కాలంలో ‘భూ కైలాస్’ లాంటి ఆణిముత్యాలు లేకపోలేదు. కాకపోతే శివుడిని కోర్ ఎలిమెంట్ గా తీసుకోవడం కత్తి మీద సాము లాంటిది. హ్యాండిల్ చేయడంలో ఏ మాత్రం తడబడినా దాని ప్రభావం ఫలితం మీద మాములుగా ఉండదు. అందుకే మాటల మాంత్రికుడికి ఇదో పెద్ద ఛాలెంజ్ కానుంది. షూటింగ్ ఇంకా స్టార్ట్ కాని ఈ ప్యాన్ ఇండియా మూవీలో శివుడు, కుమారస్వామిగా తారక్ డ్యూయల్ రోల్ చేస్తాడా లేక త్రివిక్రమ్ ఏదైనా ఊహించని షాకులు ఇస్తారా అనేది అంతు చిక్కడం లేదు. అయితే ఈ సినిమా కథాంశం ప్రధానంగా కుమారస్వామి మీద నడుస్తుంది కాబట్టి శివుడు ఎంత మొత్తంలో హైలైట్ అవుతారనేది వేచి చూడాలి

This post was last modified on June 30, 2026 10:29 am

Share

Recent Posts

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

43 minutes ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

3 hours ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

3 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

6 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

8 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

8 hours ago