Movie News

ఇద్దరు టైమింగ్ హీరోలు కలిసి నటిస్తే

మాస్ హీరోయిజంలో కామెడీ మిక్స్ చేసి మెప్పించడంలో రవితేజకు సాటి రావడం అంత ఈజీ కాదు. తన ముద్రని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. చిన్న చిన్న మాటలు వాడి ఒక డిఫరెంట్ స్టయిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో శ్రీవిష్ణుది విలక్షణమైన శైలి. ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. రాజరాజ చోర – స్వాగ్ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే మూవీలో ఈ కాంబినేషన్ సెట్ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్.

త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. దీని స్టోరీ లైన్, రవితేజ వేయబోయే పాత్ర గురించి ఆ మధ్య సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి కానీ అవేవి నిజం కాదట. 2027 సంక్రాంతి విడుదలని టార్గెట్ చేసుకుని ఈ సినిమా రూపొందిస్తారని తెలిసింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు చిన్న కమర్షియల్ టచ్ తో కూడిన మెసేజ్ చాలా బలంగా ఉంటుందని ఇన్ సైడ్ న్యూస్. ముఖ్యంగా ఈ కాంబోలో పూయించే నవ్వులు ఓ రేంజ్ లో ఉంటాయట.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రవితేజ ఇరుముడి చివరి దశ షూటింగ్ లో ఉన్నారు. ఇది ఆగస్ట్ 21 విడుదలయ్యేలోపు హసిత్ గోలి సెట్స్ లో అడుగు పెట్టొచ్చు. ఇది కాకుండా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ ఉంది. ఇరుముడి తీస్తున్న మైత్రి మూవీ మేకర్సే నిర్మాతగా వ్యవహరించడానికి అవకాశాలున్నాయి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరసగా సినిమాలు చేసేలా మాస్ రాజా రవితేజ ప్లానింగ్ మాములుగా లేదు.

ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే 2026 తనకు అంతగా కలిసి రాలేదు. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ నిరాశ పరచగా స్పెషల్ క్యామియో చేసిన గాయపడ్డ సింహం దారుణంగా పోయింది. ఓ రెండు నిముషాలు కనిపించిన నారి నారి నడుమ మురారి ఒకటే హిట్ అయ్యింది. అందుకే ఆశలన్నీ రాబోయే కామ్రేడ్ కళ్యాణ్ మీద పెట్టుకున్నాడు. ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. దీంతో ట్రాక్ లోకి వస్తాననే నమ్మకం శ్రీవిష్ణులో వ్యక్తమవుతోంది. సితార బ్యానర్ లో మరో సినిమా నిర్మాణంలో ఉంది.

This post was last modified on June 30, 2026 2:42 pm

Share

Recent Posts

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

26 minutes ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

1 hour ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

1 hour ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

2 hours ago

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

2 hours ago

ప్యారడైజ్ ఈవెంట్ సూపర్ హిట్

ఓ పెద్ద సినిమా రిలీజవుతుంటే.. అందరూ ఎదురు చూసేది ట్రైలర్ కోసమే. కానీ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న…

3 hours ago