త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.
మధ్యలో ఈ కథను ఎన్టీఆర్ కాదు.. అల్లు అర్జున్ చేయబోతున్నాడనే ప్రచారం కూడా బలంగా జరిగింది. దీంతో అసలు హీరో ఎవరు అన్నదే పెద్ద చర్చగా మారింది.
ఇప్పుడు నిర్మాత నాగ వంశీ చేసిన ఒక్క పోస్ట్ అభిమానుల్లో మళ్లీ జోష్ నింపింది. రేపు గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ ఉంటుందని ఆయన అధికారికంగా హింట్ ఇచ్చారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను ఎన్టీఆర్ నే చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ మాత్రం రేపే రానుంది.
ఎన్నో నెలలుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు రేపటి అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజంగానే గాడ్ ఆఫ్ వార్ పట్టాలెక్కితే టాలీవుడ్ లో మరో భారీ కాంబినేషన్ మొదలైనట్టే.
This post was last modified on June 28, 2026 8:05 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…