Movie News

వావ్… బెల్లంకొండ సినిమాకు 100 కోట్ల వ్యూస్

బెల్లంకొండ శ్రీనివాస్ మ‌న ద‌గ్గ‌ర ఒక మిడ్ రేంజ్ హీరో. కొన్నేళ్లుగా అత‌ను పెద్ద‌గా సినిమాలు చేయ‌క రేసులో బాగా వెనుక‌బ‌డిపోయాడు. అలాంటి హీరోకు ఉత్త‌రాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అదంతా యూట్యూబ్ ద్వారా డ‌బ్ అయిన త‌న సినిమాల ద్వారా వ‌చ్చిన పాపులారిటీ పుణ్య‌మే. అల్లుడు అదుర్స్ మొద‌లుకుని శ్రీనివాస్ న‌టించిన‌ చాలా సినిమాలను గోల్డ్ మైన్ ఫిలిమ్స్ హిందీలో అనువాదం చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయ‌డం ద్వారా కోట్లు కొల్ల‌గొట్టింది.

బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాల‌కు కేవ‌లం హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలోనే మిగ‌తా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌ను మించి ఆదాయం వ‌స్తుందంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రి త‌న సినిమాల హిందీ వెర్ష‌న్ల‌కు యూట్యూబ్‌లో ఆ స్థాయిలో ఉంటాయి వ్యూస్. ఇప్ప‌టిదాకా ఇండియ‌న్ ఫిలిం హిస్ట‌రీలోనే ఏ చిత్రానికి సాధ్యం కాని విధంగా శ్రీనివాస్ సినిమా వంద కోట్ల వ్యూస్ సాధించింది అంటే షాక‌వ్వ‌క త‌ప్ప‌దు.

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ న‌టించిన జ‌య జాన‌కి నాయ‌క చిత‌రాన్ని ఖూంఖార్ పేరుతో హిందీలో రిలీజ్ చేయ‌గా.. అది ఏకంగా 1 బిలియ‌న్ వ్యూస్ సాధించింది. ఇప్ప‌టిదాకా ఏ ఇండియ‌న్ సినిమాకూ యూట్యూబ్‌లో వంద కోట్ల వీక్ష‌ణ‌లు రాలేద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 హిందీ వెర్ష‌న్ 861 మిలియ‌న్ వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. తెలుగులో జ‌య జాన‌కి నాయ‌క ఒక మాదిరిగా ఆడింది త‌ప్ప పెద్ద హిట్టేమీ కాలేదు.

కానీ ఈ చిత్రానికి హిందీ ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అయ్యారు. ఇదే కాదు.. బెల్లంకొండ న‌టించిన ఫ్లాప్ సినిమాల‌కు సైతం యూట్యూబ్‌లో భారీ వ్యూసే ఉన్నాయి. ఈ ఫాలోయింగ్ చూసే బెల్లంకొండ‌ను కొన్నేళ్ల ముందు హిందీలో లాంచ్ చేశారు ప్ర‌ముఖ నిర్మాత జ‌యంతిలాల్. కానీ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న తీసిన ఛ‌త్ర‌ప‌తి రీమేక్ అక్క‌డ డిజాస్ట‌ర్ అయింది.

This post was last modified on June 28, 2026 10:18 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

16 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago