Movie News

చిరు అడిగాడని… చరణ్ కోసం మాటలు రాశాడు

దక్షిణాది సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అభిమానులను శోకసంద్రంలో ముంచేసి వెళ్లిపోయారు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా గొప్ప ప్రతిభను చాటిన భాగ్యరాజ్.. నిన్న గుండెపోటుతో మరణించడం దక్షిణాది సినీ ప్రముఖులతో పాటు అభిమానులకూ ఎంతో బాధ కలిగించింది. ఈ తరం ప్రేక్షకులకు ఆయన గొప్పదనం తెలియకపోవచ్చు కానీ.. 80, 90 దశకాల్లో గొప్ప కథా బలం ఉన్న చిత్రాలతో ఆయన సౌత్ ఇండస్ట్రీపై బలమైన ముద్ర వేశారు.

సుందరకాండ, అబ్బాయిగారు సహా పలు సూపర్ హిట్ తెలుగు చిత్రాలు తమిళంలో ఆయన సినిమాల ఆధారంగా తెరకెక్కినవే. విశేషం ఏంటంటే.. ఈ రెండు రీమేక్ అయినా సరే.. భాగ్యరాజ్ నటించిన ఒరిజినల్స్ తెలుగులో డబ్ అయి విజయాన్నందుకున్నాయి. ఆయన నటించిన మరెన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి. కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ అయిన భాగ్యరాజ్ చిత్రాల జాబితా పెద్దదే.

ఇంకో పెద్ద విశేషం ఏంటంటే.. ఆయన ఒక తెలుగు సినిమాకు తమిళంలో ఆయన మాటలు రాశారు. ఆయన స్థాయికి ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించేదే. కానీ ఆయన మెగాస్టార్ చిరంజీవి కోసమే ఆ పని చేశారు. ఆయన మాటలు రాసిన డబ్బింగ్ మూవీ ‘మగధీర’ కావడం గమనార్హం. తెలుగులో ఆ సమయానికి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘మగధీర’ను కొన్ని రోజుల తర్వాత ‘మావీరన్’ పేరుతో తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు.

ఆ సినిమాకు తమిళంలోనూ మంచి రీచ్ తీసుకొచ్చి చరణ్‌కు ఫాలోయింగ్ పెంచాలనే ఉద్దేశంతో చిరు.. రైటర్‌గా లెజెండరీ స్టేటస్ ఉన్న భాగ్యరాజ్‌ను మాటలు రాయమని అడిగారు.

సుదీర్ఘ కెరీర్లో ఎన్నడూ భాగ్యరాజ్ ఒక డబ్బింగ్ సినిమాకు మాటలు రాసింది లేదు. కానీ చిరు కోసం ఆ పని చేశారు. ‘మావీరన్’ తమిళంలో మంచి స్పందనే తెచ్చుకుంది. డబ్బింగ్ ఫిలిం అనే భావన రాకుండా భాగ్యరాజ్ చక్కగా మాటలు రాసి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇటీవల ఖుష్బూ కూతురి పెళ్లికి వెళ్లిన చిరు.. భాగ్యరాజ్‌తో సరదాగా గడిపారు. కానీ ఒక్క రోజు విరామంలో భాగ్యరాజ్ మరణ వార్త బయటికి రావడంతో చిరు తీవ్ర భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

This post was last modified on June 28, 2026 1:12 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

24 minutes ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

1 hour ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

2 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

7 hours ago