Movie News

మళ్లీ తమిళ దర్శకుడితో తెలుగు హీరో?

తెలుగులో కేవలం నటనకు పరిమితం కాకుండా.. రైటింగ్, మేకింగ్‌లోనూ భాగం అవుతూ తన సినిమాలను సక్సెస్ చేసుకునే హీరోల్లో నవీన్ పొలిశెట్టి ఒకడు. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మొదలుకుని.. ప్రతి సినిమాలోనూ తన కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ముఖ్యంగా తన చివరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విషయంలో అతనెంత ఇన్వాల్వ్ అయ్యాడో తెలిసిందే.

ఈ సినిమాను డైరెక్ట్ చేసిన మారి గురించి ఎవ్వరూ మాట్లాడుకోలేదు. ఆ తమిళ కుర్రాడు పేరుకే దీనికి దర్శకుడిగా ఉన్నాడు.. అన్నీ చూసుకుంది నవీనే అని వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లే సక్సెస్ క్రెడిట్ అంతా నవీన్ ఖాతాలోకే వెళ్లింది. కట్ చేస్తే ఇప్పుడు మరో తమిళ దర్శకుడితో నవీన్ జట్టు కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దర్శకుడి పేరు.. ఆంటోనీ భాగ్యరాజ్.

తమిళంలో జయం రవి హీరోగా ‘సైరెన్’ చిత్రంతో ఆంటోనీ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు కానీ.. దర్శకుడిగా ఆంటోనీని కొంత పేరొచ్చింది. ఇంకా ఈ దర్శకుడు తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించలేదు. ఐతే అతను నవీన్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. నవీన్‌తో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తీసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయనుందట.

ఆ సంస్థ అధినేతలతో నవీన్‌కు మంచి అనుబంధం ఉంది. ఇటీవల నవీన్ పంచుకున్న ఒక సరదా వీడియోలో మైత్రీ అధినేతలు కనిపించారు. ఆ వీడియో పంచుకుంటూ తన తర్వాతి సినిమా గురించి త్వరలోనే అప్‌డేట్ ఇస్తానని ప్రకటించాడు నవీన్. ఆ ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఆటోమేటిగ్గా ఈ సినిమా స్క్రిప్టులోనూ నవీన్ ఇన్వాల్వ్ అవుతాడనడంలో సందేహం లేదు. ‘అనగనగా ఒక రాజు’కు నవీన్‌తో కలిసి స్క్రిప్టు రాసిన చిన్మయి ఘాట్రాజు కూడా ఇందులో భాగం కావచ్చు.

This post was last modified on June 27, 2026 1:50 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago