ఇటీవలే కన్నుమూసిన సుప్రసిద్ధ ఫిలిం మేకర్ భారతీరాజా శాశ్వతంగా సెలవు తీసుకోవడం ఇంకా కళ్ళముందు ఉండగానే కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హీరో, దర్శకుడు, నిర్మాత కె భాగ్యరాజ్ ఇవాళ గుండెపోటుతో చెన్నైలో చివరి శ్వాస తీసుకున్నారు వయసు 73 సంవత్సరాలు. విధి విచిత్రం ఏమిటంటే భారతీరాజా తీసిన ‘పుతియ వార్పుగల్’ సినిమాతో భాగ్యరాజ్ హీరోగా తెరంగేట్రం చేశారు. దర్శకుడిగా తొలి అడుగు అదే సంవత్సరం 1977లో ‘సువరిల్లాద చిత్తిరంగల్’ తో జరగడం విశేషం.
కల్ట్ డైరెక్టర్ గా పేరున్న భాగ్యరాజ్ కి తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన పోలీస్ బావ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మా, వద్దంటే పెళ్లి, డార్లింగ్ డార్లింగ్, చిన్నరాజా లాంటివి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంచి విజయం సొంతం చేసుకున్నాయి. వెంకటేష్ నటించిన అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సుందరకాండ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ కి కథలు ఇచ్చింది భాగ్యరాజే. బాపుగారు తీసిన ‘రాధా కళ్యాణం’ మూలం ‘అంత ఏళు నాట్కల్’ భాగ్యరాజ్ సృష్టే .
అచ్చమైన పట్టణ, పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో పక్కింటి మనుషుల మధ్య జరిగినట్టుగా అనిపించే కథలతో సినిమాలు తీయడం భాగ్యరాజ్ కు మాత్రమే సొంతమైన శైలి. పాతిక సినిమాలకు పైగా దర్శకత్వం వహించగా డెబ్భై అయిదుకి పైగా చిత్రాల్లో నటుడిగా మెరిశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక మేం వయసుకు వచ్చాము, అవునా, 35 చిన్న కథ కాదు లాంటి టాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు. తమిళనాడు దిగ్గజం ఎంజిఆర్ తో నట వారసుడు అనిపించుకున్న ఘనత ఈయన స్వంతం.
కమల్ హాసన్ తో భారతీరాజా తీసిన ‘ఖైదీ వేట’కు రచన చేసింది భాగ్యరాజే. హిందీలో అమితాబ్ బచ్చన్ తో రీమేక్ చేసే బాధ్యతను అద్భుతంగా నిర్వహించారు. భాగ్యరాజ్ తీసిన ‘ఇదు నమ్మ ఆలు’ తెలుగులో ‘నేనూ మీవాడినే’గా డబ్బింగ్ చేసిన తర్వాత కూడా మోహన్ బాబుతో ‘అదిరింది అల్లుడు’గా ఈవీవీ సత్యనారాయణ రీమేక్ చేయడం లాంటి అరుదైన ఘనతలు ఎన్నో స్వంతం చేసుకున్నారు. దర్శకుడిగా ఆయన చివరి చిత్రం 2010 లో సిద్దు ప్లస్ 2. తర్వాత పూర్తిగా నటనకే అంకితమైపోయారు.
This post was last modified on June 27, 2026 10:45 am
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…