Movie News

ఆడియన్స్ పోస్టుల వల్ల సినిమా హిట్టయ్యిందా

మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా ఉంది. నిజమే.ఎవరూ కాదనలేరు. అయితే ఇవాళ వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ రివ్యూల వల్ల కాకుండా ప్రజలు పెట్టిన పాజిటివ్ పోస్టుల వల్ల సినిమా హిట్టయ్యిందని కొత్త భాష్యం చెప్పారు. అఫ్కోర్స్ ప్రేక్షకుల మద్దతు లేకుండా ఏ సినిమా ఆడదు. లవకుశ అప్పట్లోనే కోటి వసూలు చేసినా, పెద్ది మూడు వందల కోట్లు ఒక్క తెలుగు వెర్షన్ నుంచి రాబట్టినా అదంతా పబ్లిక్ చూపించిన ప్రేమే.

అయితే నందిని రెడ్డి అన్నట్టు కేవలం పోస్టులతోనే ఇంత పెద్ద విజయం దక్కిందనుకోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఇంటి బంగారంకు అండగా నిలబడిన మహిళలు ఎంత మందికి సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. ట్విట్టర్ మీద అవగాహన లేని వాళ్ళను లెక్కబెట్టుకుంటే లక్షల్లో తేలతారు. ఫేస్ బుక్ సంగతి సరేసరి. వాటి ప్రభావం పరిమిత శాతంలోనే ఉంటుంది. రివ్యూలు అందుబాటులో ఉన్న మీడియా పరిధి చాలా విస్తృతంగా ఉంటుందనేది ఓపెన్ ఫ్యాక్ట్.

అందుకే పలు మాధ్యమాల ద్వారా జనం రివ్యూలను ఫాలో అవుతుంటారు. న్యూస్ పేపర్, వెబ్ సైట్, సోషల్ మీడియా, గ్రూపింగ్ యాప్స్ ఇలా రకరకాల దారులు ఉన్నాయి. వీడియోల ద్వారా కొందరు, అక్షరాల రూపంలో మరికొందరు పాజిటివ్, నెగటివ్ రెండు రకాలుగా స్పందించేవాళ్ళు ఉంటారు. నందిని రెడ్డి తీసిన గత సినిమా అన్నీ మంచి శకునములే ఫ్లాప్ అయ్యింది. దీనికి రివ్యూలు కారణం కాదు. సంతోషం. మరి ఇదే ప్రజలు పోస్టులు పెట్టి హిట్ చేసి ఉండొచ్చు కదా.

ఇదేదో కౌంటర్ ఇచ్చే ఉద్దేశమో మరొకటో కాదు. కంటెంట్ బాగుంటే రివ్యూలు అదే హైలైట్ చేస్తాయి. ఆడియన్స్ ఎలాగూ థియేటర్లకు వచ్చి జై కొడతారు. లిటిల్ హార్ట్స్ కన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి. దానికి పాజిటివ్ రివ్యూలే వచ్చాయిగా. సమంతతో నందిని రెడ్డి తీసిన ఓ బేబీ మంచి విజయం సాధించినా, జబర్దస్త్ అనే సినిమా అడ్రెస్స్ లేకుండా పోయినా దానికి బాధ్యత తీసినవాళ్లదే తప్ప రివ్యూలదో ప్రజలదో కాదు. ఇదంతా ఎలా ఉన్నా మా ఇంటి బంగారం మాత్రం నిర్మాతలకు బంగారమే అయ్యింది.

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

13 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago