టాలీవుడ్ యంగ్ హీరో నానీని బాలీవుడ్లో అక్షయ్ కుమార్‌తో పోల్చవచ్చు. ఆయనలాగే నాని యమ స్పీడుగా సినిమాలు చేసేస్తుంటాడు. ఏడాదికి మూడుకు తక్కువ కాకుండా సినిమాలు పూర్తి చేసేస్తుంటాడు. అలాగని అతడి సినిమాల్లో క్వాలిటీ లేకుండా ఏముండదు. వైవిధ్యమైన, విషయం ఉన్న కథల్నే ఎంచుకుని సినిమాలు చేయడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు నాని.
కరోనా విరామం లేకుంటే అతను గత ఏడాది కూడా మూడు సినిమాలు లాగించేసేవాడే. ఆ బ్రేక్ తర్వాత మాత్రం అతను ఆగట్లేదు. వెంటనే టక్ జగదీష్ సినిమాను పట్టాలెక్కించేశాడు. అప్పుడే ఆ సినిమా టాకీ పార్ట్ ముగింపు దశకు వచ్చేయడం విశేషం. సోమవారం టక్ జగదీష్ కోసం నాని డబ్బింగ్ కూడా మొదులపెట్టేశాడు.
దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలతో కలిసి డబ్బింగ్ థియేటర్లో ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాని. అది చూసి అప్పుడే షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్‌కు వచ్చేశారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. టక్ జగదీష్ సెట్స్‌పై ఉండగానే.. నాని శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికీ.. అనే రెండు ఇంట్రస్టింగ్ ప్రాజెక్టులు ప్రకటించడం తెలిసిందే.
ఆల్రెడీ శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కూడా మొదలైపోగా.. త్వరలోనే ఇంకో సినిమా కూడా పట్టాలెక్కబోతోంది. టక్ జగదీష్ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇంతకుముందు నాని, శివ కాంబినేషన్లో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 5, 2021 10:16 am
ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... ఆరంటే ఆరు నిమిషాల్లోనే ఓ నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడారు. అది కూడా ఎక్కడో…
ఏపీలోని గోదావరి జిల్లాల పేరు చెప్పగానే 'పందెం కోళ్లు' గుర్తుకు వస్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్కడో ఒక చోట రోజూ…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్…
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘డాకు మహారాజ్’ విడుదలకు ముందు అందులోంచి రిలీజ్ చేసిన ‘దబిడి దిబిడి’ పాట విషయంలో…
టాలీవుడ్లో క్వాలిటీ సినిమాలు చేస్తూనే మంచి స్పీడ్ కూడా చూపించే హీరోల్లో నేచురల్ స్టార్ నాని పేరు ముందు వరుసలో…