ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ దీని మీద ఫోకస్ పెంచుతున్నారు. సుజిత్ ని పిలిపించి, చిన్న వీడియో తీయించి, దాన్ని తన నిర్మాణ సమస్త క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసినప్పటి నుంచి అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. మొదటి భాగం తీసిన డివివి దానయ్య కాకుండా ఇప్పుడు నిర్మాణ బాధ్యత మొత్తం పవన్ చేతుల్లోకే తీసుకోబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇంతకీ ఓజి 2లో ఏం చూపించబోతున్నారనేది ఫ్యాన్స్ మెదడును తొలుస్తున్న ప్రశ్న. ఫస్ట్ పార్ట్ లో ఓజాస్ గంభీర ఫ్లాష్ బ్యాక్ ని పూర్తిగా రివీల్ చేయలేదు. కేవలం ప్రకాష్ రాజ్ తో ఉన్న బాండింగ్, విలన్స్ తో క్లాష్ రావడానికి గల కారణాలు చూపించారు తప్పించి అంత కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ గా ఎలా రూపాంతరం చెందాడనే క్లారిటీ లేదు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఓజి 2లో దొరికేలా సుజిత్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. కొత్త విలన్లు చాలానే ఉంటారని వినికిడి.
ఇకపై క్రమం తప్పకుండ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉంటారని తెలిసింది. ఓజి 2 ఎప్పుడు వచ్చినా బిజినెస్ పరంగా ఆకాశమే హద్దవుతుంది. సుజిత్ మీద వర్క్ పరంగా ఉన్న ఉన్న ఒత్తిడి, ఏపీలో ఎన్నికల వల్ల ఓజిలో కొన్ని పొరపాట్లు దొర్లాయి. అయినా కంటెంట్ వల్ల మూడు వందల కోట్లు లాగింది. ఈసారి ఎలాంటి పొరపాటుకి తావు ఇవ్వకుండా సుజిత్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. రాజకీయంగా ప్రెజర్ లేదు కాబట్టి కాసిన్ని ఎక్కుడ డేట్లు పట్టేసే ఛాన్స్ ఉంది.
ఓజి 2లో ప్రియాంకా అరుళ్ మోహన్ ఉండే ఛాన్స్ లేదు కనక కొత్తగా ఎవరు జట్టు కడతారనేది వేచి చూడాలి. తమన్ సంగీతం ఎలాగూ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ స్క్రీన్ టైం కూడా ఎక్కువ ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అనుకున్న ప్లానింగ్ ప్రకారమైతే ఓజి 2 వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో రిలీజ్ చేయొచ్చు. కాకపోతే మధ్యలో ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా ఉంటే చాలు. అభిమానులు కోరుకునేది అదే.
This post was last modified on June 25, 2026 3:03 pm
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…