Movie News

హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘ధర్మన్’ ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ క్రేజీ మూవీకి ఫైనల్ గా అశ్వత్ మారిముత్తు ఫిక్స్ అయ్యారు. గత ఏడాది ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తో మంచి సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఇతను గతంలో ఓ మై కడవులే తీసిన సంగతి తెలిసిందే. దీన్నే తెలుగులో విశ్వక్ సేన్, వెంకటేష్ కాంబోలో ఓరి దేవుడాగా అతనే రీమేక్ చేశారు. ఇవాళ ధర్మన్ ఫస్ట్ లుక్ లోనే కాన్సెప్ట్ ఏంటో చూచాయగా చెప్పేశారు.

ధర్మన్ లో రజనీకాంత్ డాక్టర్ గా నటిస్తున్నారు. అంటే డబ్బులు తీసుకుని పేషెంట్ రోగాలు నయం చేసేవాడు కాదు. అదే కత్తి పట్టుకుని హత్యలు చేయడానికి కూడా వెనుకాడని డెడ్లి వైద్యుడు. దాన్నే కాప్షన్ గా పెట్టారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చబోతున్న ఈ మూవీలో మొత్తం ఎనిమిది పాటలు ఉంటాయి. ఒకదానితో మరొకటి సంబంధం లేని ట్యూన్లతో ఒక డిఫరెంట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నారట. మర్డర్లు చేసే డాక్టర్ అంటే వెరైటీగా అనిపిస్తుంది కదూ. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.

1992 శోభన్ బాబు హీరోగా సర్పయాగం వచ్చింది. పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. అందులో శోభన్ బాబు మంచి పేరున్న డాక్టర్. వృత్తికి వ్యతిరేకంగా కిరాయి హంతకులను మాట్లాడుకుని తన శత్రువులను కిడ్నాప్ చేయించి వాళ్ళను తన స్వంత చేతులతో చంపేస్తాడు. ఎందుకంటే కూతురిని మానభంగం చేసి ప్రాణాలు తీసినందుకు. ఒంగోలులో జరిగిన ఒక నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకుని ఈ కథను అల్లారు. కమర్షియల్ గా హిట్టు కొట్టింది.

ఇప్పుడీ ధర్మన్ అదే కాన్సెప్టని చెప్పడం లేదు కానీ పోలికలైతే కనిపిస్తున్నాయి. రజనీకాంత్ స్టయిలిష్ గా రక్తాన్ని హ్యాండిల్ చేయడం, వెనుక బ్యాక్ గ్రౌండ్ లో హాస్పిటల్ సీన్ వగైరాలన్నీ కొంచెం సర్పయాగాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే ఈ క్యారెక్టరైజేషన్ లో స్టార్ హీరోలు సినిమాలు చేసిన దాఖలాలు తక్కువ. అందుకే ధర్మన్ ప్రత్యేకత సంతరించుకుంటోంది. 2027 విడుదల చేయబోతున్నారు. ముందు జైలర్ 2 రిలీజ్ ఫిక్స్ అవ్వాలి. తెలుగులో కూడా ధర్మన్ అని పెట్టేలా ఉన్నారు.

This post was last modified on June 24, 2026 11:58 am

Share

Recent Posts

బ్రేకులు లేకుండానే 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ భద్రతపై ప్రశ్నలు..

భారతీయ రైల్వేలో ఆధునిక ప్రయాణానికి గుర్తింపుగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు భద్రతా వ్యవస్థపై…

16 minutes ago

తల్లి గర్భంలో ఉండగానే వెన్నుముక ఆపరేషన్

వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఒకప్పుడు అసాధ్యమనుకున్న చికిత్సలు కూడా సాధ్యమవుతున్నాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు…

47 minutes ago

కొత్త శుక్రవారం… డబ్బింగ్ VS స్ట్రెయిట్

ఇంకో హాట్ క్లాష్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ సిద్ధమవుతోంది. నవంబర్ మొదటి వారంలో రామాయణ పార్ట్ 1, సీన్ రెండు…

2 hours ago

తారకు తోడుగా రాకా రావడం ప్లస్సే

నిన్న హైదరాబాద్ లో ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య…

2 hours ago

మౌళికి ఆలోచించే టైమ్ వచ్చింది

సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న మౌళికి లిటిల్ హార్ట్స్ రూపంలో గత ఏడాది అదిరిపోయే డెబ్యూ దొరికింది. సింపుల్ లవ్…

3 hours ago

పీకేతో టచ్ లో సాయిరెడ్డి?

ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ ఎంపీ వేణుంబాకం…

5 hours ago