Movie News

మౌళికి ఆలోచించే టైమ్ వచ్చింది

సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న మౌళికి లిటిల్ హార్ట్స్ రూపంలో గత ఏడాది అదిరిపోయే డెబ్యూ దొరికింది. సింపుల్ లవ్ స్టోరీతో నవ్వించడమే ప్రధానంగా రూపొందిన ఆ మూవీ ఊహించని విధంగా వసూళ్లు సాధించి మౌళిని అగ్ర నిర్మాతల దగ్గరకు చేర్చింది. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఏకంగా మైత్రి సంస్థతో చేతులు కలిపాడు. ఫలితమే డీఎన్‌కే. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిన్న చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. భారీగా కాకపోయినా మౌళి మీద నమ్మకం వసూళ్లలో కనిపించింది.

వీకెండ్ వరకు డీసెంట్ అనుకున్నా కంటెంట్ పరంగా వచ్చిన విమర్శలను మాత్రం మౌళి అంత సులభంగా విస్మరించలేడు. ఎందుకంటే కామెడీ పేరుతో ఎంత కిందకు వెళ్లినా ఆడియన్స్ ఆదరిస్తారనుకుంటే పప్పులో కాలేసినట్టే. గతంలో బండ్ల గణేష్ అన్నట్టు సక్సెస్ ఉన్నప్పుడు చుట్టూ ప్రతిదీ అందంగానే ఉంటుంది. అది లేనిరోజు పక్కనుండి భజన చేసిన వాళ్లే దూరమవుతారు. ఇది చరిత్ర చాలాసార్లు చెప్పింది. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు చూసిన యూత్ హీరోలు తక్కువ టైంలో రిటైర్ మెంట్ తీసుకున్నారు.

సో మౌళి క్వాలిటీ మీద దృష్టి పెట్టకపోతే తర్వాత రిస్కులు ఎదురవుతాయి. సోషల్ మీడియా పాపులారిటీ శాశ్వతం కాదు. సినిమాలకు వచ్చాక లెక్కలు, ఇమేజులు మారిపోతాయి. ఒక మూసలో ఉండిపోతే ఇబ్బందులు వస్తాయి. లిటిల్ హార్ట్స్ తర్వాత మౌళి తీసుకున్న గ్యాప్ ఏడాది పైనే. అలాని ఏదో బెస్ట్ ప్రోడక్ట్ తో వచ్చాడా అంటే అదీ లేదు. డీఎన్‌కే లో ఉన్న హాస్యం ఫ్యామిలీస్ ఆస్వాదించేది కాదు. యూత్ నుంచి పూర్తి మద్దతు దక్కలేదని ఎక్స్, ఇన్స్ టా స్పందన చూస్తే అర్థమవుతుంది.

వీలైనంత త్వరగా సెన్సిబుల్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న కథల వైపు మౌళి మొగ్గు చూపడం బెటర్. తన నుంచి జనాలు డాన్సులు, ఫైట్లు ఎక్స్ పెక్ట్ చేయలేదు. వాటికి ఇంకా టైం ఉంది. మాస్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం అసలే లేదు. ఇంకా బోలెడు ముందుకు వెళ్ళాలి. టాప్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి డీఎన్‌కే కు ప్రమోషన్స్ పరంగా బ్యాకప్ దొరికింది. ప్రతిసారి అలా జరగదు కదా. సో బలంగా పడిన పునాదిని బిల్డింగ్ గా మార్చుకోవాలంటే సబ్జెక్టు సెలక్షన్ ప్లస్ స్పీడ్ విషయంలో మౌళి పకడ్బందీగా ఉండాల్సిందే. 

This post was last modified on November 16, 2026 10:25 am

Share

Recent Posts

ఓటిటి రియాక్షన్లు ఎందుకు తగ్గుతున్నాయి

కరోనా వచ్చి వెళ్ళిపోయిన ఒకటి రెండు సంవత్సరాలు ఓటిటిలో వచ్చే కంటెంట్, కొత్త సినిమాల గురించి సోషల్ మీడియాలో డిబేట్లు…

24 minutes ago

బ్రేకులు లేకుండానే 463 కి.మీ. ప్రయాణం.. వందే భారత్ భద్రతపై ప్రశ్నలు..

భారతీయ రైల్వేలో ఆధునిక ప్రయాణానికి గుర్తింపుగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు భద్రతా వ్యవస్థపై…

2 hours ago

తల్లి గర్భంలో ఉండగానే వెన్నుముక ఆపరేషన్

వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఒకప్పుడు అసాధ్యమనుకున్న చికిత్సలు కూడా సాధ్యమవుతున్నాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు…

2 hours ago

కొత్త శుక్రవారం… డబ్బింగ్ VS స్ట్రెయిట్

ఇంకో హాట్ క్లాష్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ సిద్ధమవుతోంది. నవంబర్ మొదటి వారంలో రామాయణ పార్ట్ 1, సీన్ రెండు…

3 hours ago

తారకు తోడుగా రాకా రావడం ప్లస్సే

నిన్న హైదరాబాద్ లో ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య…

3 hours ago

పీకేతో టచ్ లో సాయిరెడ్డి?

ప‌రివ‌ర్త‌న రాజ‌నీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ ఎంపీ వేణుంబాకం…

7 hours ago