పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వేణుంబాకం విజయసాయిరెడ్డి.. సలహాదారుల కోసం ఎదురు చూస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వైసీపీలోని నాయకులు కూడా కొందరు `ఇది నిజమే` అని సర్టిఫై చేస్తుండడం గమనార్హం. “సాయిరెడ్డికి అకౌంట్లు తెలుసు. కానీ.. పొలిటికల్‌గా ఆయనకు సలహాలు అవసరమే. దీనిలో తప్పులేదు“ అని ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఒకరు మీడియా ముందే చె్ప్పేశారు.
మరోవైపు.. పార్టీ ప్రకటన చేసిన తర్వాత.. సాయిరెడ్డి మూడు రోజులుగా ఎక్కడా కనిపించకపోవడం.. ఆయన సలహాదారుల వేటలో పడ్డారన్న చర్చ జరుగుతుండడం గమనార్హం. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల మేరకు.. సాయిరెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో మకాం వేశారని అంటున్నారు. జాతీయస్థాయిలో పలువురు రాజకీయ సలహాదారులు, జాతీయ మీడియా ప్రతినిధులను ఆయన కలుస్తున్నట్టు సమాచారం. తద్వారా.. తనపార్టీ విధివిధానాలు, అజెండా వంటి వాటిని ఖరారు చేసుకోవడంతోపాటు.. ప్రజల్లోకి పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపైనా ఆయన దృష్టి పెట్టారని తెలుస్తోంది.
పీకే కాదు కానీ..
ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్‌తో కాకపోయినా..ఆయన వద్ద పనిచేసిన కొందరు రాజకీయ సలహాదారులు, వ్యూహకర్తలతో సాయిరెడ్డి టచ్‌లో ఉన్నారని జాతీయ మీడియాలోనూ చూచాయగా సమాచారం తెరమీదికి వస్తోంది. అయితే.. సాయిరెడ్డితో ఎవరెవరు భేటీ అయ్యారన్నది మాత్రం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. గతంలో కేసీఆర్‌కు సలహాలు ఇచ్చిన జాతీయ మీడియా ప్రతినిధులను కూడా సాయిరెడ్డి కలుసు కున్నారన్నది హాట్ టాపిక్‌గా మారింది. అలానే బీజేపీ జాతీయస్థాయిలో వరుసగా అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ఆర్ ఎస్ ఎస్ పెద్దలతోనూ టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. మొత్తంగా తన పార్టీ ప్రమోషన్స్‌తోపాటు.. సలహాలు, సూచనలు ఇచ్చే వారి కోసం సాయిరెడ్డి తెగ వెతుకుతున్నారన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ.
This post was last modified on November 15, 2026 10:44 pm
తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి…
తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…
రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీ స్థానిక నేతలు పన్నిన వ్యూహానికి టీడీపీ…
దేశంలో ప్రస్తుతం జాతీయ స్థాయిలో రెండు కూటములు కొనసాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో `ఇండియా` కూటములు ఉన్నాయి.…
ఇటీవల జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మిగిలిపోయిన కార్పొరేషన్ స్థానాలకు, అలానే మునిసిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో…
ఏపీ సీఎం చంద్రబాబుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం షర్మిల.. హైదరాబాద్‌లోని…