ఇంకో హాట్ క్లాష్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ సిద్ధమవుతోంది. నవంబర్ మొదటి వారంలో రామాయణ పార్ట్ 1, సీన్ రెండు డబ్బింగ్ సినిమాలు మంచి జోష్ తీసుకురాగా సెకండ్ వీక్ వచ్చిన కొత్త రిలీజులు ఆశించిన ఫలితాలు అందుకోలేక ఎదురీదుతున్నాయి. సెలబ్రిటీ సపోర్ట్ దక్కిన ఇట్లు అర్జున పికప్ కోసం పోరాడుతుండగా, సోషల్ మీడియా మద్దతు దొరికిన డీఎన్కెకు ఆశించిన స్థాయిలో టాక్ లేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు రాబోయే శుక్రవారం పైకి వెళ్తున్నాయి. కాంపిటీషన్ రసవత్తరంగా ఉంది.
ప్రత్యేకంగా జెన్ జీని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ మీద భీకరమైన బజ్ లేదు కానీ ఉన్నంతలో యూత్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఓపెనింగ్స్ తెచ్చేలా ఉన్నాయి. దర్శకుడు తరుణ్ భాస్కర్ కనక కంటెంట్ తో మెప్పిస్తే ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. డబ్బింగ్ అయినప్పటికీ ‘ఓమ్’ మీద బజ్ వస్తోంది. ధనుష్, మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి మెల్లగా అంచనాలు పెంచుతున్నారు.
ట్రైలర్ ఇప్పటికే జనంలోకి వెళ్ళింది. వీటికన్నా మెరుగ్గా ‘ఆకాశంలో ఒక తార’ని తీసుకెళ్లేందుకు స్వప్న సినిమా, గీత ఆర్ట్స్ సంయుక్తంగా నడుం బిగించాయి. అల్లు అర్జున్ గెస్టుగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది. పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఈ బయోపిక్ లో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించారు. ఇవి కాకుండా కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన ‘సత్యవాన్ సావిత్రి’కి ప్రచార లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మినిమం సౌండ్ చేయడం లేదు.
వీటికి తోడు ఓవర్సీస్ లో సెన్సషనల్ హిట్ అందుకున్న ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ ఇదే వారం ఇండియన్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. దీని పట్ల చిన్నపిల్లలు, యూత్ లో మంచి క్రేజ్ నెలకొంది. అయితే శర్వానంద్ భోగి ఇదే వీక్ రావొచ్చన్నారు కానీ ఆ సూచనలు లేవు. సెన్సార్ అప్డేట్ ఇంకా రాలేదు. ఈ లెక్కన నెలాఖరుకి వస్తే గొప్పే అనుకునేలా పరిస్థితి మారిపోయింది. ఇది పక్కన పెడితే ఇన్ని ఆప్షన్స్ తో వస్తున్న న్యూ ఫ్రైడేకి ఆడియన్స్ ఎలాంటి తీర్పులు ఇస్తారో వేచి చూడాలి.
This post was last modified on November 16, 2026 11:28 am
కరోనా వచ్చి వెళ్ళిపోయిన ఒకటి రెండు సంవత్సరాలు ఓటిటిలో వచ్చే కంటెంట్, కొత్త సినిమాల గురించి సోషల్ మీడియాలో డిబేట్లు…
భారతీయ రైల్వేలో ఆధునిక ప్రయాణానికి గుర్తింపుగా నిలుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు సంబంధించిన ఓ ఘటన ఇప్పుడు భద్రతా వ్యవస్థపై…
వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఒకప్పుడు అసాధ్యమనుకున్న చికిత్సలు కూడా సాధ్యమవుతున్నాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు…
నిన్న హైదరాబాద్ లో ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య…
సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న మౌళికి లిటిల్ హార్ట్స్ రూపంలో గత ఏడాది అదిరిపోయే డెబ్యూ దొరికింది. సింపుల్ లవ్…
పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వేణుంబాకం…