ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో దర్శనమివ్వబోతున్నాడు. మహేష్ బాబు నిర్మాణం కావడంతో కంటెంట్ చాలా బలంగా ఉంటుందనే నమ్మకం మూవీ లవర్స్ లో ఉంది. దర్శకుడు వెంకటేష్ మహా కేరాఫ్ కంచరపాలెం తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఇంపాక్ట్ తన సినిమాలతో చూపించలేదు. ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ తో బంగారం లాంటి అవకాశం కోరి మరీ తలుపు తట్టింది.
సత్యదేవ్ కి ఇది హిట్ కావడం చాలా అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా స్టార్ ముద్ర పడలేదు. ఆర్టిస్టుగా మంచి పేరు ఉంది. ఆడియన్స్ లో కావాల్సినంత గౌరవం ఉంది. అయినా ఇవి సరిపోవడం లేదు. చిరంజీవి కోసం గాడ్ ఫాదర్ లో విలన్ గా నటించేందుకు సిద్ధపడినా ప్రయోజనం దక్కలేదు. బ్లఫ్ మాస్టర్ లాంటి వర్త్ ఉన్న సినిమాలు ఆడకపోవడం సత్యదేవ్ కెరీర్ ని నెమ్మదించేలా చేయడం ఒప్పుకోవాల్సిన నిజం.
జూలై 3 మంచి టైం చూసుకుని రావు బహదూర్ దిగుతున్నాడు. పోటీగా నాగబంధం ఉంది. దీన్ని తక్కువంచనా వేయడానికి లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నారు. సత్యదేవ్ సినిమా కమర్షియల్ ఎక్స్ పరిమెంట్ లా కనిపిస్తోంది. కనెక్ట అయ్యిందా ఆడియన్స్ థ్రిల్ అయిపోయి వసూళ్లు కురిపిస్తారు. ఏ మాత్రం కన్ఫ్యూజన్ ఉన్నా అటు ఇటు అయ్యే రిస్క్ లేకపోలేదు.
ఈవెంట్లలో సత్యదేవ్, వెంకటేష్ మహా మాటలు కొంత అతిశయోక్తిగా అనిపించినా సినిమా మీద వాళ్ళ నమ్మకాన్ని బహిర్గతపరిచింది. ఒకరేమో ఆర్ఆర్ఆర్ తో రావు బహదూర్ ని పోలిస్తే మరొకరేమో సత్యదేవ్ ని ఏకంగా కమల్ హాసన్ తో పోల్చేశారు. ఈ స్టేట్ మెంట్లు నిజమని ఋజువు కావాలి. అంటే ఎక్స్ ట్రాడినరిగా మూవీ ఉందనే టాక్ బయటికి రావాలి. ఇకపై నాన్ స్టాప్ గా పబ్లిసిటీ చేసేందుకు టీం రెడీ అవుతోంది. ఇది సక్సెస్ అయితే సత్యదేవ్ సినిమాలు విడుదలకు క్యూ కట్టేస్తాయి.
This post was last modified on June 24, 2026 11:49 am
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…