నిన్న హైదరాబాద్ లో ఆకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడంతో బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వామి కాబట్టి ఇది సాధ్యమయ్యిందని అనుకున్నా మొత్తానికి ఆడియన్స్ దృష్టిలో మరింత బలంగా పడేందుకు ఈ కలయిక ఉపయోగపడింది. సోషల్ మీడియాలో దీని తాలూకు వీడియోలు బాగానే తిరుగుతున్నాయి. ముఖ్యంగా రాకా అప్డేట్ గురించి బన్నీ రెస్పాన్స్ కావడం.
కొంచెం టైం పడుతుందని చెప్పడం మినహా రాకా గురించి అల్లు అర్జున్ ఎక్కువ రెస్పాన్డ్ కాలేదు. నిజానిది తెలివైన ఆలోచన. ఎందుకంటే అక్కడ అటెన్షన్ రావాల్సింది ఆకాశంలో ఒక తార కంటెంట్ మీద. అంతే తప్ప ఎపుడో రిలీజయ్యే రాకా గురించి కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని బన్నీ చాలా తెలివిగా చెప్పి చెప్పనట్టు మొక్కుబడిగా రాకా అప్డేట్ ఇచ్చి దుల్కర్ సల్మాన్ సినిమాని హైలైట్ చేయడానికి ఎక్కువ ట్రై చేశాడు. ఇది కొంతమేరకు మంచి ఫలితం ఇచ్చిందని చెప్పాలి.
నవంబర్ 20 విడుదల కాబోతున్న ఈ మూవీకి పవన్ సాధినేని దర్శకత్వం వహించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. హీరోయిన్ సాత్విక వీరవల్లి షూటింగ్ టైం నుంచే సోషల్ మీడియాలో బాగా నానుతోంది. తొలి సినిమా రిలీజ్ కాకుండానే నాగచైతన్య మూవీ ఆఫర్ రావడం, రామ్ చరణ్ 17 కోసం ఆడిషన్ చేయడం లాంటివి అందరికీ జరిగే విషయాలు కాదు. తన పెర్ఫార్మన్స్ గురించి ఇన్ సైడ్ టాక్ పాజిటివ్ గా ఉండటం ఇతర దర్శకులను తనవైపు చూసేలా చేస్తోంది.
పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకాశంలో ఒక తారకు స్టార్ క్యాస్టింగ్ తో పాటు బలమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉండటం వల్ల ఓపెనింగ్స్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. యూనిట్ చెప్పిన దానిప్రకారం ఇది మహానటి రేంజులో క్లిక్ అయ్యే కంటెంట్ లాగా కనిపిస్తోంది. అంతరిక్షానికి ఎగరాలని కలలు కనే ఒక అమ్మాయికి ఒక మాములు యువకుడు చేయూతనందించి లక్ష్యం చేరుకోవడమే ఇందులో మెయిన్ పాయింట్. ట్రైలర్ గట్రా చూస్తుంటే ఫ్యామిలీస్, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.
This post was last modified on November 16, 2026 11:06 am
సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న మౌళికి లిటిల్ హార్ట్స్ రూపంలో గత ఏడాది అదిరిపోయే డెబ్యూ దొరికింది. సింపుల్ లవ్…
పరివర్తన రాజనీతి పార్టీ(పీఆర్ పీ) పేరుతో సొంత పార్టీని స్థాపించుకున్న వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ ఎంపీ వేణుంబాకం…
తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి…
తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…
రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీ స్థానిక నేతలు పన్నిన వ్యూహానికి టీడీపీ…
దేశంలో ప్రస్తుతం జాతీయ స్థాయిలో రెండు కూటములు కొనసాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో `ఇండియా` కూటములు ఉన్నాయి.…