Movie News

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా రామ్ చరణ్, సమంత, అఖిల్, కిరణ్ అబ్బవరం, సూర్య, రవితేజ మొదలైన వాళ్లంతా ఘనవిజయాలు ఖాతాలో వేసుకోవడంతో ఇప్పుడా ట్రెండ్ కొనసాగిస్తూ నాని తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే షూటింగ్ ఇంకా చివరి దశలో ఉంది తప్ప పూర్తవ్వలేదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డే అండ్ నైట్ దాని మీదే ఉన్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం శని ఆదివారాలు కూడా ప్యారడైజ్ బృందం యమా స్పీడుతో చిత్రీకరణ చేస్తోందట. విడుదల తేదీ ఒత్తిడి అంతకంతా ఎక్కువవ్వడంతో పాటు ఈసారి వాయిదా ఛాన్స్ లేని నేపథ్యంలో ప్రాణాలు పెట్టేసి మరీ పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అనిరుధ్ రవిచందర్ కు ఫైనల్ కాపీ ఇవ్వాలి. ఇతర తమిళ సినిమాలతో పాటు వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉన్న ఇతని డేట్స్ పట్టుకోవడం ఒకరకంగా సవాల్ అయిపోయింది.

నాని, మోహన్ బాబు సహా ఇతర ఆర్టిస్టులు అందరూ పూర్తి సహకారం అందజేస్తున్న ప్యారడైజ్ థియేటర్ బిజినెస్ దాదాపు పూర్తయ్యినట్టే. అవి రివీల్ అయ్యాక ట్రేడ్వర్గాలు దీని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాయో అర్థమవుతుందని టీమ్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నైజాంలో ఎప్పుడూ చూడని ఓపెనింగ్, రెవిన్యూ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషన్లకే సంబంధించి పెద్ద ప్లాన్ సిద్ధమవుతోందని తెలిసింది.

ఎంత స్పీడ్ గా పరిగెత్తినా సెప్టెంబర్ రెండో వారం అయిపోయేలోపే ఫస్ట్ కాపీతో సహా మొత్తం సిద్ధం చేసుకుంటే టెన్షన్ ఉండదు. కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయొలెంట్ యాక్షన్ డ్రామాలో సంపూర్నేష్ బాబు ఒక సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నారు. మోహన్ బాబుతో పాటు రాఘవ్ జుయెల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ప్యారడైజ్ తెలుగు రాష్ట్రాల థియేటర్ బిజినెస్ ఊహకందని నెంబర్లతో ఉండబోతోంది. 

This post was last modified on August 24, 2026 7:11 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 hours ago