Movie News

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న పాత సినిమాలకు ఈవెంట్ చేయడం కొత్త కాదు కానీ ఇంత గ్రాండ్ గా చేయడం అరుదు. ఎందుకంటే ఆ మల్టీప్లెక్సులో ఈవెంట్ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా వచ్చిన ప్రతి ఒక్కరికి 3డి గ్లాసులు సప్లై చేశారు. వీటికి అదనంగా ఛార్జ్ ఉంటుంది. స్క్రీన్ అద్దె, బ్యానర్లు, యాంకర్, టీమ్ వ్యయాలు, మీడియా మేనేజ్ మెంట్ ఇలా సవాలక్ష పనులు చూసుకోవాలి.

కొత్త మూవీకి ఇలా చేయడం మాములే కానీ జస్ట్ రెండేళ్ల క్రితం వచ్చిన హనుమాన్ కి ఇంత హడావిడి చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎంత 3డి అయినా జనాలు మరీ ఎగబడిపోయి వస్తారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ ని సైతం ఈ సాంకేతికలో చూసేందుకు తెలుగు ఆడియన్స్ పెద్దగా ఇష్టపడలేదు. కాకపోతే హనుమాన్ కేసు వేరు. విఎఫెక్స్, ఫాంటసీ ఎపిసోడ్స్, క్లైమాక్స్ వగైరాలు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటాయి. రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

ఇక్కడో విషయం గమనించాలి. సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు గెస్టుగా వచ్చాడు. కారణం సింపుల్. హనుమాన్ తీసిన నిరంజన్ రెడ్డినే సంబరాల ఏటిగట్టుక్లి ప్రొడ్యూసర్ కాబట్టి. ఇది చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ ఫైనల్ చేయలేదు. ప్యాన్ ఇండియా సినిమాలు డిసెంబర్ దాకా కర్చీఫ్ లు వేసుకుంటున్న తేజ్ టీమ్ మాత్రం సైలెంట్ గా ఉంది. అయిపోయింది వచ్చేస్తుంది అంటున్నారు తప్ప ఫలానా తేదీ అని కన్ఫర్మ్ గా చెప్పడం లేదు.

ఇప్పుడీ ఈవెంట్ ద్వారా ప్రైమ్ షో సంస్థ తమ మీద వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. హనుమాన్ 3డిని తీసుకురావడం ద్వారా తమ బ్రాండ్ ని మరోసారి గుర్తు చేయడంతో పాటు నెక్స్ట్ వచ్చే సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండదనే సందేశం ఇస్తున్నారేమో. జూన్ చివరి వారంలో చాలా రీ రిలీజులు ఉన్నాయి. హనుమాన్ 3డికి ఫ్యామిలీస్, చిన్న పిల్లల సపోర్ట్ చాలా అవసరం. నెలాఖరులో టికెట్ల కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తారానేది వేచి చూడాలి.

This post was last modified on June 21, 2026 10:09 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

57 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago