Movie News

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు, తమిళనాడు కేరళలో వైఫల్యం వల్ల అంచనాలకు తగ్గట్టు అయిదు వందల కోట్లను అందుకోలేకపోవడం మెగా ఫ్యాన్స్ ని కలవరపరుస్తోంది. ఎందుకంటే రామ్ చరణ్ దీని కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు మీద నమ్మకంతో ఏది చేయమంటే అది చేశారు. ఫలితం నిరాశపరచకుండా హిట్ అనిపించుకోవడం పెద్దికి దక్కిన గొప్ప ఊరట.

ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ జూన్ 23 బుధవారం పెట్టుకున్నారు. నిజానికి కాస్త ముందుగా ప్లాన్ చేసి ఉంటే వీకెండ్ వసూళ్లకు మరింత దోహద పడేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒక వైపు సమంత మా ఇంటి బంగారం జోరు మాములుగా లేదు. ఫ్యామిలీస్ దానికి క్యూ కడుతున్నాయి. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ పెద్ది ఒకటే. దీవానా, బాలన్, వంద దేవుళ్ళు, ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు వేర్వేరు ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్నవి తప్ప ప్రత్యేకించి కుటుంబాలను కాదు.

ఎలా చూసినా పెద్ది నెక్స్ట్ శుక్రవారంతో నాలుగో వారంలోకి అడుగు పెడుతుంది. ఇక ఫైనల్ రన్ కి దగ్గరగా ఉందని చెప్పొచ్చు. ఓటిటి అగ్రిమెంట్ నలభై రోజులకు చేశారా లేక నాలుగు వారాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ తెలంగాణ చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసిన పెద్ది రికవరీ పరంగా నైజామ్, ఆంధ్ర లాంటి ప్రాంతాల్లో లాభాలు ఇచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే సంతృప్తి శాతమే ఎక్కువ ఉంది కానీ యునానిమస్ హిట్టు ముద్ర మిస్ అయ్యింది.

బుధవారం వేడుక ఒకరకంగా థాంక్స్ మీట్ అని కూడా చెప్పొచ్చు. ప్రత్యేకంగా చిరంజీవి లాంటి గెస్టులు ఎవరైనా వచ్చే అవకాశం లేకపోలేదు. చరణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశముంది. ఎందుకంటే ఇదయ్యాక చరణ్ మూడు నెలలు విశ్రాంతి తీసుకోబోతున్నాడు. సుకుమార్ ఆర్సి 17 డిసెంబర్ లేదా జనవరిలో స్టార్ట్ కావొచ్చు. షూటింగ్ ఎంత లేదన్నా ఏడాది పైనే పడుతుంది. రిలీజ్ 2027లో ఉంటుంది. సో పెద్ది జ్ఞాపకాలనే వాళ్ళు అప్పటిదాకా భద్రపరుచుకోవాలి.

This post was last modified on June 21, 2026 11:38 pm

Share

Recent Posts

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

16 minutes ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

3 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

5 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

8 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

9 hours ago