మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్ మాట్లాడుకుంటున్న ఫోటో పెట్టడం ద్వారా మరోసారి డిస్కషన్ కు తెర తీశారు. పవన్ పాలనలో బిజీగా ఉన్నప్పటికీ హఠాత్తుగా సూజిత్ ని కలుసుకుని ఇవాళ ఫోటో పెట్టడం వెనుక మర్మం ఏమిటనే దాని మీద అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. ఓజి 2 ఎప్పుడు ఎక్కడ ఎలా, ఎవరి చేతికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుందనేది.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓజి 2ని నిర్మాత డివివి దానయ్య చేయడం లేదు. ఓజి షూటింగ్ కీలక దశలో ఉన్నప్పుడు జపాన్ షెడ్యూల్ కు సంబంధించి ఏవో విభేదాలు రావడం వల్ల సుజిత్ స్వంత ఖర్చుతో వీలైనంత తక్కువ బడ్జెట్ తో అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చారట. దీని కోసం తన కారును సైతం అమ్మేశారనే టాక్ వినిపించింది. దానికి బదులుగానే ఓజి హిట్టవ్వగానే పవన్ ఖరీదయిన కారుని కానుకగా ఇచ్చారనే టాక్ కు సాక్ష్యంగా వాళ్ళిద్దరి ఫోటోలు ఉన్నాయి.
ఇప్పుడు దీన్ని ఎవరు టేకప్ చేస్తారనే డౌట్ కు మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. బ్రో ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి పవన్ మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చారట. ఒకవేళ అది నిజమైన పక్షంలో టిజి విశ్వప్రసాద్ తో పాటు క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ని భాగస్వామిగా చేసి పవర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగుతారు. ఈ ప్రాజెక్టు మీద ఆయనకు ఎంత ఆసక్తి ఉందో ఇటీవలే వరంగల్ అభిమాని పరామర్శలో బయట పడింది.
పక్కా డేట్ ఇంకా చెప్పలేదు రాబోయే మూడు నాలుగు నెలల్లో ఓజి 2కి శ్రీకారం చుట్టవచ్చని అంటున్నారు. బ్లడీ రోమియో కోసం నాని ఇప్పుడప్పుడే అందుబాటులోకి వచ్చేలా లేడు. ప్యారడైజ్ డిసెంబర్ అంటున్నారు. అదే నిజమైన పక్షంలో జనవరి లేదా ఫిబ్రవరి దాకా సుజిత్ ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈలోగా తక్కువ కాల్ షీట్స్ తో ఓజి 2 ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ మాత్రం తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఎప్పుడు వచ్చినా రికార్డులు బద్దలు కావడం ఖాయం మరి.
This post was last modified on June 21, 2026 8:19 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…