ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం అంతకంతకూ తగ్గించేస్తుండడంతో ఆక్యుపెన్సీలు పడిపోతున్నాయి. ఇలాంటి టైంలో ఉన్నంతలో వైడ్ రిలీజ్ దక్కిన ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు రెండో రోజు థియేటర్లు, స్క్రీన్లు పెరుగుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.
సమంత కొత్త చిత్రం మా ఇంటి బంగారం ఈ ఘనతే సాధిస్తోంది. పెద్ది రిలీజై రెండు వారాలు గడిచిపోవడం.. పోటీగా రిలీజైన సినిమాలు చిన్నవే కావడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బాగానే థియేటర్లు ఇచ్చారు. ఐతే రిలీజ్ ముంగిట సినిమాకు ఉన్న క్రేజ్.. విడుదల తర్వాత ఇంకా పెరిగింది. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయి.. బుకింగ్స్ అంతకంతకూ పెరగడంతో కొన్ని చోట్ల ఉన్న థియేటర్లు సరిపోవడం లేదు.
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పెద్ది సినిమా రెండో వారంలో హౌస్ ఫుల్స్‌తో రన్ అయిన నేపథ్యంలో థర్డ్ వీకెడ్ కోసం చాలా స్క్రీన్లను అట్టిపెట్టారు. మా ఇంటి బంగారం చిత్రం స్థాయికి తగ్గట్లుగా నగరాలు, పట్టణాల్లో స్క్రీన్లు కేటాయించారు. కానీ సినిమాకు శనివారం ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడడం.. ఉన్న స్క్రీన్లు సరిపోకపోవడంతో చాలా చోట్ల స్క్రీన్లు, షోలు పెంచినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఇటు సింగిల్ స్క్రీన్లను యాడ్ చేయడంతో పాటు మల్టీప్లెక్సుల్లో షోలూ పెంచుతున్నారు. ఆదివారం కూడా సినిమా చాలా బాగా ఆడుతుందనే సంకేతాలు కలుగుతున్నాయి. తెలంగాణలోనూ మల్టీప్లెక్సుల్లో ఈ మూవీకి షోలు పెంచారు.
వీకెండ్లో మా ఇంటి బంగారం ట్రేడ్ పండితుల అంచనాలను మించి ఊహించని నంబర్స్ సాధించబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ.. అందులోనూ ఎబోవ్ యావరేజ్ టాక్, రివ్యూలు తెచ్చుకున్న చిత్రానికి ఇంత డిమాండ్ ఏర్పడడం ఆశ్చర్యం కలిగించే విషయమే. బయ్యర్లందరూ వీకెండ్లోనే లాభాల బాట పట్టబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on June 21, 2026 9:57 am
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…