Movie News

ప్యారడైజ్ విలన్ గురించి ఏమంటున్నారు

నిన్న ది ప్యారడైజ్ నుంచి రాఘవ్ జుయెల్ పోషించిన విక్రమ్ మాలిక్ ఫస్ట్ లుక్ ని టీజర్ రూపంలో టీమ్ విడుదల చేసింది. కిల్ లో దారుణమైన హంతకుడి పాత్రలో అద్భుతంగా మెప్పించిన రాఘవ్ ని ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం ఎంచుకున్నప్పుడే ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ నానితో తలపడే క్యారెక్టర్ కావడంతో హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే వీడియో చూశాక జనాల నుంచి మిశ్రమ అభిప్రాయాలు కలుగుతున్నాయి.

రాఘవ్ జుయెల్ లుక్కుని పవర్ ఫుల్ గా డిజైన్ చేసినప్పటికీ ఎక్కడో కొంచెం సెట్ అవ్వలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అతని పర్సనాలిటీకి తగ్గట్టు స్క్రీన్ ప్రెజెన్స్ ఉండాలి తప్ప అతికించినట్టు ఉండకూడదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని ఈ విషయంలో తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే అసలు సినిమాలో దీని తాలూకు ఇంపాక్ట్, అప్పీయరెన్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని ఇన్ సైడ్ టాక్.

అసలు ప్రతినాయకుడు శిఖంజి మాలిక్ అలియాస్ మోహన్ బాబు కొడుకే ఈ విక్రమ్ మాలిక్. వీళ్లిద్దరికీ నానికి మధ్య ఉన్న సంబంధమే పారడైజ్ లో మెయిన్ డ్రైవింగ్ పాయింటని ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ 21 ఈ సినిమా రావడం లేదు. నిన్న టీజర్ లో రిలీజ్ డేట్ తీసేయడం ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. కొత్త తేదీ సెప్టెంబర్ లో ఉంటుందా లేక ఏకంగా డిసెంబర్ కు వెళ్తుందా అనేది ఇంకా ఫైనల్ కాలేదు. టీమ్ ఇప్పుడప్పుడే ప్రకటన ఇవ్వకపోవచ్చు.

అన్ని ప్యాన్ ఇండియా సినిమాలకొచ్చే సమస్యే ప్యారడైజ్ కు వచ్చింది. డేట్లు మారుతూనే ఉన్నాయి. అభిమానుల ఎదురు చూపులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బజ్ తగ్గిపోకుండా చూసుకోవాల్సిన పెద్ద బాధ్యత శ్రీకాంత్ ఓదెల మీద ఉంది. ఎందుకంటే చికిరి చికిరి టైంలో ఉన్న పెద్ది బజ్ కి ట్రైలర్ వచ్చాక కనిపించిన హైప్ కి తేడా ఉంది. ఆ ప్రభావం టాక్ మీద పడి ఓవర్సీస్, నార్త్ లో వసూళ్లు రాలేదు. కాబట్టి ప్యారడైజ్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.

This post was last modified on June 20, 2026 11:15 am

Share

Recent Posts

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

3 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

4 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

4 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

6 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

6 hours ago