అక్కినేని అఖిల్‍కి హిట్టిచ్చి తీరాలని…


అఖిల్‍ అక్కినేని పెద్ద స్టార్‍ అయిపోతాడని అనుకుంటే ఇప్పుడు కనీసం ఒక్క హిట్‍ పడితే చాలన్నట్టుగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్‍ వద్ద ఫ్లాప్‍ అవడంతో అఖిల్‍ ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్‍ బ్యాచ్‍లర్‍’ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు కానీ సడన్‍గా ఆ ఆలోచన విరమించుకున్నారు. దానికి కారణం సెకండ్‍ హాఫ్‍పై వున్న డౌట్లేనని తెలిసింది.

జీఏ2 పిక్చర్స్ సినిమాల షూటింగ్‍ ఎంత త్వరగా పూర్తయినా కానీ ఎడిటింగ్‍లో బాగా టైమ్‍ తీసుకుంటారు. ఎలాగయినా దానిని ప్రేక్షక జన రంజకంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తారు. అవసరమయితే మరికొన్ని రోజుల షూటింగ్‍ చేస్తారు. లేదా తీసిన సీన్లనే మళ్లీ రీషూట్‍ చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాచ్‍లర్‍కి అవే మెరుగులు దిద్దుతున్నారట. అందుకే సంక్రాంతి రిలీజ్‍ వద్దనుకున్నారట. అలాగే జనవరి 31 వరకు సినిమా థియేటర్లపై ఆంక్షలు కొనసాగుతాయి కనుక ఫిబ్రవరి నుంచి ఆ నిబంధనలు ఎత్తి వేస్తారని ఆశిస్తున్నారు. అందుకే సమ్మర్‍ రిలీజ్‍ ప్లాన్‍ చేస్తే బెస్ట్ అని అనుకుంటున్నారు.