Movie News

ఆదర్శంలో ఎలాంటి ఆలస్యం ఉండదు

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు వారాల క్రితం వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా ఛాయలు కొన్ని ఇందులో ఉండటం వల్ల కొంత భాగం రీ షూట్ జరుగుతోందని, కథలోనూ కొన్ని మార్పులు చేశారని ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఈ మూవీ ఏకంగా వెంకీ అనిల్ 5 తర్వాత వస్తుందనే కొత్త గాసిప్ కు శ్రీకారం చుట్టారు.

అయితే అలాంటివేవీ లేవట. ముందుగా చేసుకున్న ప్లానింగ్ ప్రకారం ఆదర్శ కుటుంబం ఏకే 47 సెప్టెంబర్ కల్లా మొత్తం పూర్తి చేసుకుని అక్టోబర్ 2 రిలీజ్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. దసరా ఆప్షన్ కూడా పరిశీలించారు కానీ దానికన్నా మొదటి వారం అయితే బెటరని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. దీని వల్ల థియేటర్ రన్ కు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు నిర్మాత నాగవంశీ త్వరలోనే ఆ లాంఛనం పూర్తి చేయొచ్చు.

స్టోరీ, కంటెంట్ గురించి లీక్స్ సంగతి ఎలా ఉన్నా ఆదర్శ కుటుంబం మీద కుటుంబ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకటేష్ నటించాలనేది ఆయన అభిమానుల చిరకాల కోరిక. అది నెరవేరుతోంది. ఆయన డైలాగులు రాసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటివి అంత గొప్ప విజయం సాధించినప్పుడు ఇప్పుడు మాటల మాంత్రికుడే మెగా ఫోన్ పట్టుకుంటే దగ్గుబాటి అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది.

ఎలాగూ అనిల్ రావిపూడి సినిమా 2027 సంక్రాంతికి వచ్చేస్తుంది కాబట్టి దానికి ఆదర్శ కుటుంబంకు కనీసం మూడు నెలల గ్యాప్ ఉండటం అవసరం, నిర్మాతలు ఆ కోణంలోనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక మంచి ఫ్యామిలీలో ఏకే 47 ప్రవేశించేంత అలజడి ఏం రేగిందనే పాయింట్ మీద దీన్ని రూపొదించారు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ కొట్టినా గుంటూరు కారం నిరాశ పడటంతో ఇప్పుడు అందరి కళ్ళు త్రివిక్రమ్ మీదే ఉన్నాయి. అంచనాలు అందుకుంటే వసూళ్ల మోతే.

This post was last modified on June 18, 2026 2:37 pm

Share

Recent Posts

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

27 minutes ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

1 hour ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

2 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

2 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

13 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

13 hours ago